Representational Image (Photo Credits: Unsplash.com)

Anantapur, Mar 4: పెళ్లి అయిందనే సంతోషం ఆ వరుడికి ఒక్కరోజు కూడా మిగలలేదు. పెళ్లైన మరుసటిరోజే భర్త ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని ఓ నవ వధువు (Bride Escapes with Cash and Jewellery) ఉడాయించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం కమ్మవారిపల్లిలో (Anantapur Kammavaripalli village)సంచలనం రేకెత్తించింది. అక్కడి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు సంతానం.

పిల్లల సంరక్షణ కోసమంటూ గత నెల 28న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. మరుసటి రోజు భర్త ఇంటికి కాపురానికి వచ్చిన ఆమె.. ఇంటిలో ఉన్న మూడు తులాల బంగారు నగలు, రూ.80వేలు తీసుకుని పారిపోయింది. ప్రియుడితో కలిసి భార్య ఒడిశాలో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం పోలీసులకు వరుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, వివాహిత కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రేమను బంద్ చేయమన్న తండ్రి, కుదరని చెప్పడంతో కూతురు తలనే నరికేశాడు, ఆపై ఆ తలను పట్టుకుని పోలిస్ స్టేషన్లో లొంగిపోయాడు, యూపీలో షాకింగ్ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇక చెన్నైలో మరో ఆసక్తికర ఘటన జరిగింది. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెల్లారితే ముహూర్తం అనగా రిసెప్షన్‌ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు అదృశ్యం కావడంతో వరుడి బంధువులు వివాహం తాలూకు ఫ్లెక్సీలు చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన వివరాల్లోకెళితే.. చెన్నై శివారు నగరం పూందమల్లి సమీపాన చెంబరంపాక్కంకు చెందిన యువకుడికి మధురాంతకం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం కుదిర్చారు. గురువారం ఉదయం నసరత్‌పేటలోని ఓ కల్యాణమండపంలో వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు.

బుధవారం సాయంత్రం ఆ కల్యాణ మండపంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు వరుడు వచ్చాడు. కానీ ఎంతసేపైనా వధువు, ఆమె బంధువులెవరూ రాకపోవడంతో వరుడు కంగారు పడ్డాడు. రిసెప్షన్‌కు రావడానికి గాను అలంకరణ నిమిత్తం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు ఉద్దేశపూర్వకంగా అదృశ్యమైందని, ఆమె కోసం ఆమె బంధువులు గాలిస్తున్నారని తెలుసుకున్న వరుడు, అతని బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. కల్యాణ మండపంలోని వివాహం తాలూకు ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేశారు. నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నసరత్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో వరుడు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.

ఇలా ఎవరూ మోసపోకండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ. 20 కోట్లు కొట్టేసిన దొంగల ముఠా, చిత్తూరు పోలీసులకు చిక్కిన ముఠా నాయకుడు, మీడియాకు వివరాలను వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్‌ చేసి వివాహితతో అసభ్యంగా మాట్లాడటమే కాక.. వేరే వారికి ఆమె నంబర్‌ ఇచ్చి వేధింపులకు గురి చేస్తోన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాలు.. ఆదిభట్ల మున్సిపాలిటిలోని పటేల్‌ గూడకు చెందిన గడుసు నరసింహ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడు. వేర్వేరు నంబర్ల నుంచి ఆమెకు కాల్‌ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు.

‘‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా’’ అంటూ అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తూ.. వేధింపులకు గురి చేసేవాడు. అంతటితో ఊరుకోక ఇతరులకు వివాహిత నంబర్‌ ఇచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన సదరు మహిళ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ట్రేస్‌ చేసి నిందితుడిని నరసింహంగగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నరసింహంతో పాటు అతడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. మరో షాకింగ్‌ అంశం ఏంటంటే నరసింహం గత జూలైలో అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికి అతడు తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు.