UP Shocker: ప్రేమను బంద్ చేయమన్న తండ్రి, కుదరని చెప్పడంతో కూతురు తలనే నరికేశాడు, ఆపై ఆ తలను పట్టుకుని పోలిస్ స్టేషన్లో లొంగిపోయాడు, యూపీలో షాకింగ్ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Murder (Photo Credits: Pixabay)

Hardoi, March 4: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి (Father) కన్న కూతురినే అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆపై తల నరికి, చేతిలో పట్టుకుని పోలీస్‌ స్టేషనుకు బయల్దేరాడు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని హర్దోయి ( Hardoi) జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే... పండేతారా గ్రామానికి చెందిన సర్వేశ్‌ కుమార్‌ (Sarvesh) అనే వ్యక్తికి పదిహేడేళ్ల కూతురు ఉంది. కాగా గత కొన్ని రోజులుగా ఆమె ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సర్వేశ్‌ కోపంతో రగిలిపోయాడు. ప్రతిష్టకు మచ్చ తెచ్చే పని చేసిందంటూ పదునైన ఆయుధంతో ఆమెను నరికి చంపాడు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, బాటసారులు విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రశ్నించగా..‘‘నేనే చేశాను. ఇందులో వేరే ఎవరికీ ప్రమేయం లేదు. తలుపులు గడియపెట్టి తనను నరికాను. ఆ తర్వాత మొండాన్ని అక్కడే పడేసి తల స్టేషనుకు తీసుకువస్తున్నా’’అంటూ ఏమాత్రం బెదురు లేకుండా సమాధానమిచ్చాడు. ఆ సమయంలో అతడిలో పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. సర్వేశ్‌ను అరెస్టు చేసి, విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

ఆ మహిళ నాలుగు గంటల పాటు నాపై అత్యాచారం చేసింది, గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన మరో మహిళ, రేప్ గా పరిగణించలేక ’లైంగిక వేధింపుల‘ కేసుగా నమోదు చేసిన పోలీసులు

కాగా అతను రెండు రోజుల క్రితం కుమార్తెను ఈ ప్రేమ వ్యవహారం మానుకోవాలని కోరారు. అయితే అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందిడుతు కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కూతురు తలతొ నడుచుకుంటూ వస్తుండగా స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు పోలీసులు అతన్ని అడ్డగించి లక్నో నుండి 143 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశామని, తదుపరి చర్యలు తీసుకుంటున్నామని పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ వాట్స్ (uperintendent of Police Anurag Vats) తెలిపారు.

నాతోనే ఉండు..పెళ్లి చేసుకోకు, యువతి అంగీకరించకపోవడంతో కత్తితో దాడి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పరిస్థితి విషమం, పోలీసులు అదుపులో నిందితుడు

ఎన్‌సిఆర్‌బి యొక్క "క్రైమ్ ఇన్ ఇండియా" 2019 నివేదిక ప్రకారం, ఉత్తర ప్రదేశ్ మహిళలపై అత్యధికంగా నేరాలు (59,853) నమోదైంది, దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులలో 14.7 శాతం ఉన్నాయి. పోక్సో చట్టం ప్రకారం యుపిలో బాలికలపై అత్యధిక నేరాలు ఉన్నాయి.