Image used for representational purpose | (Photo Credits: File Image)

Delhi, Mar 3: ఓ మహిళ నాలుగు గంటల పాటు నాపై అత్యాచారం చేసిందని, మత్తు మందు ఇచ్చి నా ప్రైవేట్ పార్ట్స్ తో ఘోరంగా ఆటాడుకుందని మరో మహిళ గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఓ స్త్రీ మరో స్త్రీని రేప్ చేయడంతో ఏ కేసు కింద దీనిని తీసుకోవాలో తెలియక తలలు బద్దలు కొట్టుకున్నారు. చివరకు లైంగిక వేధింపుల కింద ఫిర్యాదును (Goa police book Delhi woman for sexual assault) స్వీకరించారు.

షాకింగ్ ఘటన వివరాల్లోకెళితే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి (Delhi woman) గే, లెస్బియన్, బై సెక్సువల్ వంటి వారి సమస్యలపై పోరాటం చేస్తుండగా.. ఆమెకు కొంత కాలం క్రితం ఫ్రెంచ్ కు చెందిన 26 ఏళ్ల యువతి (French woman) ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయింది. ఆమె కూడా అదే తరహా సమస్యలపై పోరాటం చేస్తున్నానని తెలపడంతో ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఫిబ్రవరి 23న ఢిల్లీ మహిళ గోవాకు వెళ్లగా.. అదే సమయంలో ఆ ఫ్రెంచ్ యువతి కూడా అక్కడే ఉంది.

నాతోనే ఉండు..పెళ్లి చేసుకోకు, యువతి అంగీకరించకపోవడంతో కత్తితో దాడి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పరిస్థితి విషమం, పోలీసులు అదుపులో నిందితుడు

ఇది తెలుసుకున్న ఢిల్లీ యువతి తనను కలవాల్సిందిగా కోరింది. దీనికి ఫ్రెంచ్ యువతి కూడా సరేనంది. అదే రోజు ఢిల్లీ మహిళ చెప్పిన హోటల్ కు ఫ్రెంచ్ యువతి వెళ్లింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అదే సమయంలో తనకు వెన్ను నొప్పి ఉందంటూ ఫ్రెంచ్ యువతి చెప్పింది. నొప్పి తగ్గేందుకు ఓ టాబ్లెట్ ను ఫ్రెంచ్ యువతికి ఆ ఢిల్లీ మహిళ ఇచ్చింది. ఆ మాత్రలు వేసుకున్న ఫ్రెంచ్ యువతి మత్తులోకి జారుకుంది.

తర్వాత ఢిల్లీ మహిళ మత్తులో ఉన్న ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడింది. దాదాపు నాలుగు గంటల పాటు నాపై ఆమె అత్యాచారం చేసింది. ఆమె ఏం చేస్తోందన్నది నాకు అర్థం అవుతోంది. కానీ నేను ఏం చేయలేని స్థితిలో ఉండిపోయాను. ఆమెను ఎదుర్కోలేకపోయాను‘ అంటూ ఆ ఫ్రెంచ్ యువతి పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. షాక్ నుంచి కోలుకున్న ఆమె మరుసటి రోజు గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంత్రి రమేశ్‌ జార్కిహొళి సెక్స్ వీడియో బయటకు, కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్న సీడీ, రాజీనామా చేయించే యోచనలో సీఎం యడ్డ్యూరప్ప సర్కారు

తనను అత్యాచారం చేశారంటూ ఆమెపై ఫిర్యాదు చేసినప్పటికీ, దాన్ని రేప్ గా పరిగణించలేక ’లైంగిక వేధింపుల‘ కేసుగా నమోదు చేశారు. ఫిబ్రవరి 25న ఆ ఢిల్లీ మహిళను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.