Odisha Horror: కూతురు తలని గొడ్డలితో నరికిన కసాయి తండ్రి, ఆ తలను పట్టుకుని ఊరంతా తిరిగాడు, మద్యానికి బానిసయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నిర్థారించిన ఒడిశా పోలీసులు
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Sambalpur, Mar 28: ఒడిశాలోని జైపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కూతుర్ని ఓ తండ్రి అత్యంత దారుణంగా హ‌త్య (man beheads 8-year-old girl) చేశాడు. ఆమెను గొడ్డ‌లితో న‌రికి చంపి, త‌ల‌తో ఊరంతా (roams village with severed head) తిరిగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ‌మ‌న్ కీరా బ్లాక్‌లోని ఓ గ్రామానికి చెందిన 30 ఏండ్ల వ్య‌క్తికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నాయి. అయితే ఓ అమ్మాయి శుక్ర‌వారం ఉద‌యం కాల‌కృత్యాలు తీర్చుకునేందుకు త‌మ వ్య‌వ‌సాయ పొలం వ‌ద్ద‌కు వెళ్లింది.

కూతురు వెనుకాలే వెళ్లిన తండ్రి.. ఆమెను గొడ్డ‌లితో విచ‌క్ష‌ణార‌హితంగా న‌రికి చంపాడు. అనంత‌రం మొండెం నుంచి త‌ల‌ను వేరు చేసి గ్రామంలోకి తీసుకొచ్చాడు. ఆ త‌ర్వాత త‌ల‌తో ఊరంగా తిరిగి, అంద‌ర్నీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. కూతుర్ని చంపాడ‌న్న వార్త తెలుసుకున్న త‌ల్లి.. అత‌న్ని మంద‌లించేందుకు య‌త్నించింది. ఆమెను గొడ్డ‌లితో బెదిరించాడు. స్థానికులు అందించిన స‌మాచారంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

హైదరాబాద్‌లో దారుణం, ఉద్యోగం పేరుతో యువతిని లాడ్జీకి తీసకెళ్లి రేప్ చేసిన మృగాడు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యువతి...

అయితే బాలిక హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ప్రాథమిక విచారణలో అతడు మద్యానికి బానిసైనట్లు తేలిందని, అయితే మృతుడి కుటుంబంతో ఎలాంటి శత్రుత్వం లేదని కూచింద సబ్‌డివిజనల్ పోలీసు అధికారి రాజ్‌కిషోర్ మిశ్రా తెలిపారు. అతను నేరం చేసినప్పుడు అతని మనస్సులో ఏమి జరుగుతుందో మేము ఇంకా నిర్ధారించలేకపోయాము" అని అధికారి చెప్పారు. ఇద్దరు కూతుళ్ల తండ్రైన నిందితుడికి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగడం నిత్యకృత్యమని, అయితే మానసికంగా కుంగిపోయిన వ్యక్తి కాదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, బాలిక మృతదేహాన్ని శవపరీక్షకు పంపామని, దర్యాప్తు జరుగుతోందని జమన్కిరా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌జీత్ దాస్ తెలిపారు.