Shristi Goswami: ఉత్తరాఖండ్ సీఎంగా 20 ఏళ్ల యువతి, జనవరి 24న ముఖ్యమంత్రి సీట్లో ఒక్క రోజు కూర్చోనున్న సృష్టి గోస్వామి, బాలికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి (Shristi Goswami) బాధ్యతలు చేపట్టనుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉండేది మాత్రం ఒక్కరోజే. ఎందుకంటే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకోనుంది.
Dehradun, Jan 23: ఒకే ఒక్కడు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అందులో హీరో అర్జున్ ఒక్క రోజు సీఎంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సినిమా బాక్సాపీస్ వద్ద దుమ్మురేపింది. మరి నిజ జీవితంలా అలా సాధ్యమేనా అంటే అవుననే సమాధానం వస్తోంది.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి (Shristi Goswami) బాధ్యతలు చేపట్టనుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉండేది మాత్రం ఒక్కరోజే. ఎందుకంటే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకోనుంది.
ప్రతియేటా జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అందులో భాగంగా జనవరి 24న జరగబోయే బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం (Uttarakhand CMO) కుర్చీలో ఆ బాలిక కూర్చోనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సీఎం కుర్చీలో హరిద్వార్ జిల్లా దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి కూర్చోనుంది. ఈమె బీఎస్సీ డిగ్రీ చదువుతోంది.
ఉత్తరాఖండ్ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్ సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆదివారం ఉత్తరాఖండ్ వేసవి రాజధాని అయిన గైర్‌సెన్‌లో సృష్టి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో (Trivender Singh Rawat) కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై ఈ యువతి సమీక్ష నిర్వహించనుంది. ఆయుష్మాన్‌భవ, స్మార్ట్ సిటీ, పర్యాటకతో పాటు ఇతర శాఖల కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సీఎం హోదాలో సృష్టి చర్చించనుంది.
ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని.. నివేదికలు రూపొందించి సమావేశానికి రావాలని ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపు ఉత్తరాఖండ్‌లో నవ పాలన సాగనుంది. అయితే సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2009లో థాయిలాండ్‌లో జరిగిన బాలికల అంతర్జాతీయ లీడర్‌షిప్ కార్యక్రమానికి సృష్టి హాజరైంది.
(The above story first appeared on LatestLY on Jan 23, 2021 04:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

