Hosur Accident: గ్రానైట్‌ లారీ బీభ‌త్సం, బ్రేకులు ఫెయిల్ అయ్యి 15 వాహ‌నాల‌ను ఢీకొట్టిన లారీ, ఒక‌రు మృతి, 12 మందికి గాయాలు, ఏడుగురి ప‌రిస్థితి విష‌మం (వీడియో)

గ్రానైట్‌తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి కారుని ఢీకొంది. ఆ వెనకే వస్తున్న పలు వాహనాలు ఒకదానికోటి ఢీకొన్నాయి (Accident). మొత్తం 15 వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. వాటిలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Hosur Accident: గ్రానైట్‌ లారీ బీభ‌త్సం, బ్రేకులు ఫెయిల్ అయ్యి 15 వాహ‌నాల‌ను ఢీకొట్టిన లారీ, ఒక‌రు మృతి, 12 మందికి గాయాలు, ఏడుగురి ప‌రిస్థితి విష‌మం (వీడియో)
Hosur Accident (PIC@ X)

Hosur, AUG 25: బెంగళూరు-కృష్ణగిరి మార్గంలోని హోసూరు (Hosur Accident) సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నమ్మశక్యం కాని రీతిలో వాహనాలు ఢీ కొన్నాయి. గ్రానైట్‌తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి కారుని ఢీకొంది. ఆ వెనకే వస్తున్న పలు వాహనాలు ఒకదానికోటి ఢీకొన్నాయి (Accident). మొత్తం 15 వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. వాటిలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి.

వీడియో ఇదుగోండి

 

ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్షతగాత్రులను హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు-కృష్ణగిరి హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది.

(The above story first appeared on LatestLY on Aug 25, 2024 11:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).