Sex Rocket Representational Image. (Photo Credit: Getty)

Prostitution Racket Busted in Chennai: చెన్నై యాంటీ వైస్ స్క్వాడ్ (ఏవీఎస్) మైనర్ బాలికలను వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై కె నదియా (37) అనే మహిళతో సహా ఏడుగురిని సోమవారం అరెస్టు చేసింది. నిందితురాలు పాఠశాలకు వెళ్లే బాలికలను, మధ్య, దిగువ-మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తన కుమార్తె సహచరులను బలవంతంగా ఈ వ్యభిచారంలోకి నెట్టింది.. పార్ట్‌టైమ్‌గా డబ్బు సంపాదిస్తామనే నెపంతో నదియా అమ్మాయిలకు డ్యాన్స్ క్లాసులు నిర్వహించి వారికి బ్యూటీషియన్ కోర్సులు నేర్పిస్తాననే నెపంతో వారితో స్నేహంగా మెలిగేది.

ఇండియా టుడే కథనం ప్రకారం.. పోలీసు ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ సెల్వరాణి నేతృత్వంలో జరిగింది. వలసరవాక్కంలోని ఒక లాడ్జిపై బృందం దాడి చేసింది, అక్కడ వారు 17 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను రక్షించారు. అరెస్టయిన వారిలో సుమతి (43), మాయా ఓలి (29), జయశ్రీ (43), రామచంద్రన్ (42), రామంద్రన్ (70) - అందరూ చెన్నై నివాసితులే. అలాగే కోయంబత్తూరుకు చెందిన అశోక్ కుమార్ (31) ఉన్నారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.  దారుణం, ఎయిడ్స్ ఉందని తెలిసి కండోమ్ లేకుండా 200 మందితో సెక్స్‌లో పాల్గొన్న అమెరికన్ మహిళ, విషయం తెలిసి హెల్త్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

నదియా తన కుమార్తె సహవిద్యార్థులను, ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డ్యాన్స్, బ్యూటీషియన్ క్లాసులు ఇస్తానన్న నెపంతో వారితో స్నేహం చేసింది. వారిని విటుల దగ్గరకు పంపేందుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. అమ్మాయిలు అభ్యంతరం చెబితే, వారి వీడియోలను తల్లిదండ్రులతో పంచుకుంటానని బెదిరించేది. తనకు HIV ఉన్నా దాచి ఆరేళ్ల నుంచి భార్యతో శృంగారంలో పాల్గొన్న భర్త, విషయం తెలిసి షాకయిన భార్య, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

కొంతమంది బాలికలను హైదరాబాద్, ఢిల్లీ వంటి ఇతర నగరాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. విటులలో కొందరు కోయంబత్తూర్, ఇతర నగరాలకు చెందిన వృద్ధులు కూడా ఉన్నారు. మరికొంతమంది బాధితులు ఉండవచ్చని, తదుపరి విచారణ కోసం నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సౌత్), చైల్డ్‌లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సౌత్) అధికారులు బాధితులను ఇంటర్వ్యూ చేసి అదనపు కౌన్సెలింగ్ అందించడానికి పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు.