Bengaluru, Feb 18: బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళల హెల్ప్‌లైన్‌లోని కౌన్సెలర్‌లు ఈ ప్రతీకార ఘటనను చూసి ఖంగుతిన్నారు. HIV-పాజిటివ్ కలిగిన ఓ వ్యక్తి తన భార్య తనను విడిచిపెట్టి వెళ్లినందుకు ప్రతీకారంగా ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి (HIV Positive Man Forces Wife Into Unprotected Sex) పాల్పడ్డాడు. HIV ఉందని తెలిసినా కూడా ఎటువంటి సురక్షితమైన పరికరాలు పాటించకుండా ఆమెపై అత్యాచారం (Unprotected Sex for Leaving Him) చేశాడు. ఈ ఘటనతో ఆ మహిళ తనకు కూడా పాజిటివ్ వచ్చిందేమోనని ఫలితాలు కోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ కేసులో దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన ఓ యువతి గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్గా పనిచేస్తోంది. ఆమె ఈ మధ్య తన భర్త మోసం చేశాడని బనశంకరి మహిళా పోలీసులను ఆశ్రయించింది. వారు ఆమెను బసవనగుడి పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లోని వనితా సహాయవాణి కుటుంబ సలహా కేంద్రమైన పరిహార్‌కు రెఫర్ చేశారు. ఇక్కడ ఆమె తనకు జరిగిన దారుణ అనుభవాలను షేర్ చేసుకుంది. గతంలో విడాకులు తీసుకున్న మహిళ అలాగే పెళై భార్యను వదిలేసిన క్యాబ్ డ్రైవర్ ఇద్దరూ 2015 చివరలో పెళ్లి చేసుకున్నారు.
అయితే క్యాబ్ డ్రైవర్ మోసగాడు. చాలామందిని ఇలా పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి వారిని వదిలేసే వాడు. అతను అతని యెక్క సిస్టర్ ఇద్దరూ ఈ రకమైన మోసాలకు పాల్పడేవారు. పెళ్లై విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారిని పెళ్లి వైపు ప్రోత్సాహించి అందిన కాడికి డబ్బులు గుంజుకునే వారు. ఈ యువతిని కూడా ట్రాప్ చేసేందుకు వారు 2015లో ట్రిక్‌ను ఉపయోగించారు' అని కేసును డీల్ చేసిన ఫ్యామిలీ కౌన్సెలర్ బింద్యా యోహన్నన్ తెలిపారు.
వివాహం తర్వాత, క్యాబీ మొదట్లో తన అత్త నివాసమని పేర్కొంటూ మడివాలాలోని ఒక భవనంలోని ఒకే గది వసతిలో మహిళను ఉంచాడు. ఆ తరువాత పోలీసులు ఆ ప్రదేశంపై దాడి చేశారు. వ్యభిచార రాకెట్‌ను నడుపుతున్నారనే అనుమానంతో ఆమె, మరికొందరు మహిళలు పట్టుబడ్డారు. "డ్రైవర్ ఈ విషయంపై ఆమెను ఒప్పించి, ఆమెకు బెయిల్ ఇప్పించాడు. సెటిల్ మెంట్ కింద వచ్చిన రూ. 2 లక్షలను తన జేబులో వేసుకున్న తర్వాత వారు మళ్ళీ జేపీ నగర్‌లో స్థిరపడ్డారు” అని పరిహార్ కౌన్సెలర్ తెలిపారు.
అయితే వారి సంబంధానికి కొన్ని నెలల తర్వాత, మహిళ ఇంట్లోడ్రైవర్ మాత్రలను పట్టుకుని ఇవి ఏంటని అతనిని నిలదీసింది. అతను HIV-పాజిటివ్ అని ఒప్పుకున్నాడు తన మొదటి భార్య నుండి సోకినట్లు ఆమెతో తెలిపాడు. ఆ మహిళ ఏం చేయలేక తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చినందున తప్పనిసరి పరిస్థితుల్లో అతనితో ఉండవలిసి వచ్చింది. అయితే పెళ్లి అయినప్పటి నుంచి ఈ క్యాబ్ డ్రైవర్ ఆమెతో సెక్స్ లో ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండానే పొల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఆమె ప్రతి ఆరు నెలలకు బెంగళూరు ల్యాబ్‌లో హెచ్‌ఐవి పరీక్షలు తీసుకుంటోందని ఇది తన జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన అని పేర్కొంది.
గత ఆగస్టులో, తన నైట్ డ్రెస్‌లలో ఒకటి కనిపించకుండా పోవడంతో మహిళకు అనుమానం వచ్చింది. ఆమె తన భర్త మొబైల్‌లో ఓ ఫోటోను చూసింది, ఆ దుస్తులను వారి డ్రాయింగ్ రూమ్‌లోని సోఫాలో కూర్చున్న ఓ తెలియని మహిళ ధరించినట్లు ధరించింది. తన భర్త హెచ్‌ఐవీ పాజిటీవ్ అయినప్పటికీ అతనితో ఉంటున్నప్పటికీ తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ఆమె అతనిని వదిలిపెట్టి వెళ్లింది. ఇప్పుడు ఆమె అతనిని విడిచిపెట్టి తన తల్లి వద్దకు వెళ్లింది. తన భర్త తనను మోసం చేశాడని కేసు పెట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.