Ahmedabad, Feb 3: గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (Ahmedabad) లో ఘోరం జరిగింది. భార్య విడాకులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త నీచానికి దిగజారాడు. ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రస్తుతం మాట్లాడుకుంటున్న జంటకు ఏడాది క్రితమే వివాహమైంది. అయితే, ఆ తర్వాత కొంతకాలం నుంచే వీరి మధ్య విభేదాలు మొదలవ్వడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని భావించిన ఆమె (21) విడాకులు తీసుకుందామని ప్రతిపాదించింది. ఇది భర్తకు ఆగ్రహం తెప్పించింది.
https://t.co/Ga3aWzrjvC Gujarat: Husband Allegedly Leaks Wife's Private Photos & Videos On WhatsApp Over Divorce Dispute In Ahmedabad#DivorceDispute #blackmail #privatephotos #harassment
To get epaper daily on your whatsapp click here:
— Free Press Journal (@fpjindia) February 2, 2025
ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని..
విడాకులు అడిగిన తన భార్యపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని భావించిన ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్య అని కూడా చూడకుండా ఆమె ప్రైవేటు ఫొటోలు, వీడియోలను అసభ్య కామెంట్లతో ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఇద్దరూ ఉపయోగిస్తుండటంతో ఆ వీడియోలు ఆమె కంటపడ్డాయి. వాటిని చూసి నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.