Bengaluru, Jan 24: బెంగళూరు(Bengaluru)లో విషాదం నెలకొంది. భార్య విడాకులు(divorce) కోసం దరఖాస్తు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన 39 ఏళ్ల మంజునాథ్ అనే క్యాబ్ డ్రైవర్(Cab Driver) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో తన భార్య ఇంటి బయట నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోగా ఘటనాస్థలంలోనే మంజునాథ్ మృతి చెందాడు.
బెంగళూరులోని ఎన్జీఈఎఫ్ లేఅవుట్‌లో ఉండే మంజునాథ్(Manjunath) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2013లో మేకప్ ఆర్టిస్ట్ అయిన నయన రాజ్(Nayana Raj)ను వివాహం చేసుకోగా వారికి 9 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అయితే 2022లో విడాకులకు దరఖాస్తు చేసుకుంది మంజునాథ్ భార్య. దేశంలో మళ్ళీ మంకీపాక్స్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. కర్ణాటకలో గుర్తింపు
అప్పటినుండి వారిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే మంజునాథ్ తరచూ ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, భార్య తిరిగి రావాలని కోరేవాడు. అంతేగాదు విడాకుల దరఖాస్తు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా నయన తిరస్కరించేది.
Bengaluru cab driver dies by suicide
A 39-year-old cab driver, distressed after his wife filed for divorce, committed suicide by setting himself on fire outside her house in #Bengaluru.
He died on the spot. The man's mother lodged a complaint suspecting foul play involving the wife and her family.
Know more 🔗… pic.twitter.com/KTFIrsY0PX
— The Times Of India (@timesofindia) January 24, 2025
అయితే గురువారం ఉదయం 8:30 గంటల సమయంలో, మంజునాథ్ మరోసారి నయనను కలిశారు. కానీ ఆమె తిరస్కరించడంతో ఉదయం 11:30 గంటల సమయంలో నయన ఇంటి బయట నిలబడి నిప్పంటించుకోగా ఈ ఘటనలో మంజునాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంజునాథ్ మరణంపై అనుమానం వ్యక్తిం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నయన కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.