Allu Arjun Fan Sriteja Who Collapses in Sandhya Theater Pushpa Dance Video

Hyderabad, Feb 3: సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) లో ప్రదర్శించిన పుష్ప 2 (Pushpa 2) సినిమా తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. 2 నెలలుగా సికింద్రాబాద్‌ కిమ్స్‌ హాస్పిటల్ ​లో బాలుడు చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బాలుడు శ్రీతేజ్‌ కు అందుతున్న చికిత్స గురించి వివరాలను బన్నీ వాసు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తామని బన్నీ వాసు తెలిపారు. శ్రీతేజ్‌ వైద్య ఖర్చులు భరిస్తామని వివరించారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో తమన్‌.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తమన్ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో

తరలింపు అందుకే..

శ్రీతేజ్ ఇటీవలే కోమాలో నుంచి బయటికి వచ్చాడు. అయితే, ఇంకా ఎవరినీ గుర్తు పట్టని స్థితిలోనే ఉన్నాడు. రెండు నెలలుగా చికిత్స అందిస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేని స్థితి. శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో విదేశాలకు తీసుకెళ్లి బాలుడికి ట్రీట్మెంట్ చేయించాలా? విదేశీ డాక్టర్స్‌ ని ఇక్కడికి పిలిపించాలా అనే యోచనలో 'పుష్ప' చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.

ట్రెండ్‌కు తగ్గట్లు విశ్వక్‌ సేన్‌ లైలా మూవీ మూడో సాంగ్, కోయ్ కోయ్‌ అంటూ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ 

జరిగింది ఇదీ..

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తర్వాత శ్రీతేజ్ ను  పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సీపీఆర్ చేసి వెంటనే సికింద్రాబాద్​ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనికి ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తుంది. సినిమా ప్రముఖులు సైతం సాయం చేశారు.