Credits: Google

Indore, Mar 1: త్వరితగతిన ప్రమోషన్, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం బాస్‌తో పడుకోవాలని (man forces wife to sleep with boss) ఒక వ్యక్తి తన భార్యను బలవంతం చేశాడు. అతడి సోదరుడు కూడా పలుమార్లు ఆమెను రూంకి వచ్చి పడుకోవాలని వేధించాడు. ఈ టార్చర్‌ భరించలేకపోయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ చివరకు కోర్టును ఆశ్రయించింది.దీంతో భర్త, అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

లడఖ్‌లో వింత జంతువు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, టిబెటియన్ లింక్స్ అంటూ నెటజన్లు కామెంట్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఒక మహిళకు మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన అమిత్ ఛబ్రాతో వివాహమైంది.పెళ్లయిన తర్వాత తన భర్త తప్పుడు వ్యక్తులతో కలిసి అనైతిక, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడేలా బలవంతం చేయడం ప్రారంభించాడని మహిళ ఆరోపించింది.దీంతో భార్యల మార్పిడికి (wife swapping ) సహకరించాలని, ప్రమోషన్‌ కోసం బాస్‌తో పడుకోవాలని భార్యను బలవంతం చేశాడు. అలాగే అమిత్‌ సోదరుడు కూడా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించాడు.

నిత్యానంద కైలాస దేశం నుంచి UN సమావేశాలకు రాయబారి, ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన విజయప్రియ నిత్యానంద, తెగ వెతికేస్తున్న నెటిజన్లు

తన బావ మరిది రాజ్ తన 12 ఏళ్ల కుమార్తె ఎదుటే తనను పలుమార్లు వేధించాడని మహిళ ఆరోపించింది. లైంగిక వేధింపులను మహిళ ప్రతిఘటించడంతో, ఆమెను కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. నిత్యం వేధింపులకు గురికావడంతో మనస్తాపం చెంది తన చేతి సిరను కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది.ఆత్మహత్యాయత్నం తర్వాత కూడా వేధింపులు వీడలేదని చెప్పింది.

ఆ మహిళ చివరకు ఆగస్టు 2022న ఇండోర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. వేధింపుల గురించి ఆమె తల్లికి తెలియజేయలేదు.కొన్ని రోజుల తర్వాత తన బాధను తల్లికి చెప్పుకుంది. చివరకు తల్లి అండతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇండోర్‌ పోలీసులు అమిత్‌ను పిలిపించారు. అయితే ఇకపై తన భార్యను వేధించనంటూ లిఖితపూర్వకంగా అతడు హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి భర్త ఇంటికి వెళ్లింది.

అయితే కొంతకాలం తర్వాత మళ్లీ అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. దీంతో మహిళ తల్లిదండ్రులు ఇండోర్ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు మహిళా సంక్షేమ అధికారితో విచారణకు ఆదేశించింది. ఆ మహిళపై వేధింపులు నిజమేనని దర్యాప్తులో తేలింది. దీంతో కోర్టు ఆదేశంతో ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు