ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో నిత్యానంద కైలాస దేశానికి చెందిన రాయబారి (Vijayapriya Nithyananda Attend UN Event) తళుక్కుమన్నారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తనకు తాను ప్రకటించుకున్న ‘కైలాస దేశం’ నుంచి ప్రతినిధిగా Vijayapriya Nithyananda యుఎన్ సమావేశాలకు హాజరయ్యారు. కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్ష, వింతైన తలపాగా, భారీ ఆభరణాలతో ఓ మహిళ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లడఖ్‌లో వింత జంతువు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, టిబెటియన్ లింక్స్ అంటూ నెటజన్లు కామెంట్
జెనీవాలో గతవారం జరిగిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (సీఈఎస్‌సీఆర్) సమావేశంలో నిత్యానంద ‘కైలాస దేశం’ నుంచి మహిళా ప్రతినిధిగా విజయప్రియ నిత్యానంద హాజరై ప్రసంగించారు. సార్వభౌమ కైలాస దేశం నుంచి UNలో తాను శాశ్వత రాయబారినని చెప్పుకున్నారు. యుఎన్ లో విజయప్రియ (Vijayapriya Nithyananda) మాట్లాడుతూ.. కైలాస దేశం అనేది హిందువుల తొలి సార్వభౌమ దేశమని, దీన్ని నిత్యానంద (Nithyananda) పరమశివం స్థాపించారని చెప్పారు.
Here's Updates
USK at UN Geneva: Inputs on the Achievement of Sustainability
Participation of the United States of KAILASA in a discussion on the General Comment on Economic, Social and Cultural Rights and Sustainable Development at the United Nations in Geneva
The Economic, Social, and… pic.twitter.com/pNoAkWOas8
— KAILASA's SPH Nithyananda (@SriNithyananda) February 25, 2023
Preliminary meeting with the head of KAILASA St Louis, ma Sona Kamat, representatives of KAILASA, and diplomats from Fiji in Geneva#Kailasa #UN #Geneva #Fiji pic.twitter.com/XQkpJ41drR
— KAILASA's SPH Nithyananda (@SriNithyananda) February 27, 2023
ఈ సందర్భంగా భారతదేశంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.అందుకే భారత్ వదిలి ఈ దేశాన్ని ఏర్పాటు చేసిన నిత్యానంద హిందూ సాంప్రదాయాలను, నాగరికతను అక్కడ పునరుద్ధరిస్తున్నారని చెప్పారు.హిందువుల కోసం ఏర్పాటైన తొలి సార్వభౌమ దేశం కైలాస దేశమని ఆమె తెలిపారు.
Here's Speech Video
Statement by Kailasa’s Permanent ambassador to the UN, Her Excellency Ma Vijayapriya Nithyananda!#Kailasa #Nithyananda pic.twitter.com/iBFHZn1aHV
— The Avatar Clicks (@clicksavatar1) March 1, 2023
ఆమె వీడియోను ఐక్యరాజ్యసమితి తమ వెబ్‌సైట్లో పోస్ట్ చేసింది. అయితే కైలాస దేశాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిందా? లేదా? అన్నదానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అత్యాచారం, అపహరణ వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద (Nithyananda)పై భారత్‌లో నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ అయింది. 2019లో దేశం విడిచి నిత్యానంద పారిపోయారు. 2020లో ఈక్వెడార్ తీరానికి దగ్గర్లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసిన నిత్యానంద దాన్ని కైలాస దేశంగా ప్రకటించారు.
యూఎన్ లో అందరికీ షాకిచ్చిన విజయప్రియ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం... ఆమె కెనడాలోని మనిటోబా యూనివర్శిటీ నుంచి మైక్రోబయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మెరుగైన విద్యార్థిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కాలేజీలో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు డీన్ హానర్ జాబితాలో ఆమె పేరును కూడా చేర్చారు. 2013, 2014 సంవత్సరాల్లో ఆమె ఇంటర్నేషనల్ యూజీ స్టూడెంట్ స్కాలర్ షిప్ ను సాధించారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, పెజిన్స్, క్రియోల్ భాషలను ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఆమె ఏ దేశానికి చెందినవారనే అంశంలో మాత్రం స్పష్టత లేదు.