ఉత్తర కొరియా సర్వోన్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న నిరంకుశ దేశం అసాధారణమైన నియమాలు, చట్టాలను కలిగి ఉంది. ఇప్పుడు, పాశ్చాత్య మీడియా అణిచివేతను తీవ్రతరం చేసే ప్రయత్నంలో భాగంగా, ఉత్తర కొరియా తమ పిల్లలు పాశ్చాత్య నిర్మిత చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలను చూస్తూ పట్టుబడితే తల్లిదండ్రులను (North Korean Parents) శిక్షిస్తానని బెదిరించినట్లు దేశంలోని మూలాలు రేడియో ఫ్రీ ఆసియాకు తెలిపాయి. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ చిత్రాలను వీక్షిస్తూ ( Children Watch Hollywood Films) పట్టుబడిన పిల్లల తల్లిదండ్రులను ఆరు నెలల పాటు జైలుకు (Sent To Prison in Six Months) పంపుతారు. అలాగే పిల్లలకు ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది.
తమ పిల్లలు విదేశాల నుండి మీడియా స్వాధీనంలో చిక్కుకుంటే తల్లిదండ్రులు తీవ్రమైన హెచ్చరికతో తప్పించుకునేవారు. అయితే, ఈసారి, పాశ్చాత్య సంస్కృతికి గురైన పిల్లల తల్లిదండ్రుల పట్ల ఎటువంటి ఉదాసీనత చూపబడదు. సోషలిస్ట్ ఆదర్శాలలో తమ పిల్లలకు "సరిగ్గా" విద్యను అందించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యను అందించేందు కిమ్ ప్రభుత్వం ఈ రకమైన నిబంధన తీసుకువచ్చిందని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఈ కఠినమైన చర్యలను ప్రకటించారు. దీంతో పాటుగా దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.