Radika Supports Roja: మరీ ఇంత నీచంగా మాట్లాడుతారా? రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ మంత్రి రోజాకు మద్దతు ఇచ్చిన నటి రాధిక
”రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళలను వ్యభిచారులుగా చిత్రీకరిస్తారా? దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను.
Vijayawada, OCT 06: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాని (Roja) ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రోజాకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మరో సినీ నటి రాధిక (Radhika sarathkumar) సైతం స్పందించారు. మంత్రి రోజాకు ఆమె మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు.
”రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళలను వ్యభిచారులుగా చిత్రీకరిస్తారా? దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి” అని నటి రాధిక అన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 06, 2023 09:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

