Chhattisgarh: వీడియో ఇదిగో.. 80 అడుగులో లోతులో బాలుడు, 500 మంది ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు దళాలతో 104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్, సురక్షితంగా బయటకు వచ్చిన బాలుడు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బోరుబావిలో పడిన 11 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు సుమారు 500 మంది ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు దళాలు..దాదాపు 104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చెవిటి, మూగ సమస్యలు ఉన్న చిన్నారి రాహుల్ సాహూ 80 ఫీట్ల లోతు ఉన్న బోర్‌వెల్‌లో పడ్డాడు. జూన్ 10వ తేదీన ఇంటి వెనుక ఉన్న బోరులో అతను పడిపోయాడు.
- Read in
- తెలుగు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బోరుబావిలో పడిన 11 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు సుమారు 500 మంది ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు దళాలు..దాదాపు 104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చెవిటి, మూగ సమస్యలు ఉన్న చిన్నారి రాహుల్ సాహూ 80 ఫీట్ల లోతు ఉన్న బోర్‌వెల్‌లో పడ్డాడు. జూన్ 10వ తేదీన ఇంటి వెనుక ఉన్న బోరులో అతను పడిపోయాడు. ఈ ఘటన మల్కరోడా డెవలప్మెంట్ బ్లాక్‌లో ఉన్న పిహిరిద్ గ్రామంలో జరిగింది. ఆ బాలుడు సుమారు 60 ఫీట్ల లోతులో చిక్కుకుపోయాడు. బోరుబావిలో పిల్లలు పడ్డ సంఘటనల్లో ఇదే అతి సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ అని అధికారులు చెప్పారు. 2006లో హర్యానలోని కురుక్షేత్రలో ఓ చిన్నారిని 50 గంటల తర్వాత రక్షించిన విషయం తెలిసిందే. చత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భగల్ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. బాలుడిని కాపాడిన రెస్క్యూ బృందానికి థ్యాంక్స్ చెప్పారు. చిన్నారి రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
#WATCH | Chhattisgarh: 10-yr-old Rahul who fell into a borewell in Pihrid village of Janjgir-Champa district was successfully rescued after over 100 hours of operation. pic.twitter.com/HDsoRXvjt3
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 14, 2022
It was a very challenging operation. Rahul could be successfully rescued because of the joint efforts of the team members. It is a huge success for all of us. Around 25 Army officials were deployed here: Army Personnel Gautam Suri pic.twitter.com/eiTKsZxv71
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 14, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 15, 2022 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

