Rajasthan Shocker: కట్నం ఇవ్వలేదని.. భార్యను బంధువులతో రేప్ చేయించిన కసాయి భర్త, దాన్ని వీడియో తీసి...ఆ వీడియో ద్వారా డబ్బులు సంపాదిస్తానని బెదిరింపులు
రాజస్థాన్ భరత్‌పూర్‌లో దారుణ ఘటన (Rajasthan Shocker) చోటు చేసుకుంది. అడిగినంత కట్నం తేలేదని ఓ భర్త తన భార్యపైన కిరాతకానికి (Rajasthan Man Molested) పాల్పడ్డాడు. లక్షన్నర రూపాయల వరకట్నం ఇచ్చినప్పటికీ పెళ్లైన నాటి నుంచి బాధితురాలు వేధింపులు ఎదుర్కొంటోంది.
Jaipur, April 30: రాజస్థాన్ భరత్‌పూర్‌లో దారుణ ఘటన (Rajasthan Shocker) చోటు చేసుకుంది. అడిగినంత కట్నం తేలేదని ఓ భర్త తన భార్యపైన కిరాతకానికి (Rajasthan Man Molested) పాల్పడ్డాడు. లక్షన్నర రూపాయల వరకట్నం ఇచ్చినప్పటికీ పెళ్లైన నాటి నుంచి బాధితురాలు వేధింపులు ఎదుర్కొంటోంది. పేదింటి కుటుంబం కావడంతో వారు అడిగినంత కట్నం ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి తెగబడింది అత్తింటి కుటుంబం. తన బంధువులతో కలిసి భర్త ఆమెను సామూహిక అత్యాచారం చేశాడు. ఆ సమయంలో లైంగిక దాడిని వీడియో (With Relatives Filmed) కూడా తీశాడు.
కట్నం డబ్బు తీసుకురాకుంటే ఈ వీడియో ద్వారా డబ్బు సంపాదించుకుంటానని ఆమెను బెదిరించాడట. ఈ మేరకు భరత్‌పూర్ కమాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ‘‘నీ కుటుంబ సభ్యులు ఎలాగూ కట్నం ఇవ్వలేరూ. కనీసం ఇప్పుడు నీ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసైనా ఆ డబ్బు సంపాదించుకుంటా’నని భర్త బెదిరింపులకు దిగాడు. దీంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించిందామె.
నిందితుల్లో ఇద్దరికీ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు అయ్యానని, మరొకరు ఆమెను ఐదురోజుల కిందట భర్త పిలుస్తున్నాడని చెప్పి కమాన్ ప్రాంతానికి తీసుకొచ్చి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్తోంది. అంతేకాదు పారిపోయి ఇంటికి వచ్చాక కూడా వదలకుండా నిందితులంతా ఆమెపై ఘోరానికి తెబడ్డారట. పరారీలో ఉన్న కీచకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వీడియోను ఎక్కడైనా అప్‌లోడ్ చేశారా? ఎవరెవరికి పంపారనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు.
(The above story first appeared on LatestLY on Apr 30, 2022 03:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

