Rajasthan Shocker: దారుణం, కూతురికి మళ్లీ పెళ్లి చేశాడని తండ్రి ముక్కు చెవులు కోసిన మాజీ అత్తింటివారు, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య బాధితుడు
రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.కూతురికి మళ్లీ చేశాడనే కోపంతో కొంతమంది ఓ వ్యక్తిపై దాడి చేశారు. పెళ్లి రిగిన కొన్నిరోజులకే ఒక గుంపు అతని ఇంటిపై దాడి చేసి అతన్ని చావబాదింది.
Barmer, Sep 14: రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.కూతురికి మళ్లీ చేశాడనే కోపంతో కొంతమంది ఓ వ్యక్తిపై దాడి చేశారు. పెళ్లి రిగిన కొన్నిరోజులకే ఒక గుంపు అతని ఇంటిపై దాడి చేసి అతన్ని చావబాదింది. చివరకు అతని ముక్కు, చెవులు కోసేసి (Relatives cut off nose), కాలు విరగ్గొట్టి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో వెలుగు చూసింది.
ఆదర్శ్ సోంది గ్రామానికి చెందిన సుఖరాం బిష్ణోయి (55).. తన కుమార్తెకు ఆరేళ్ల క్రితం పెళ్లి చేశాడు. అయితే అక్కడ ఉండలేకపోయిన ఆమె ఏడాది క్రితం ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇంట్లోనే ఉంటున్న కుమార్తెకు మరో సంబంధం చూసి పెళ్లి చేశాడు సుఖరాం. అంతే, కొందరు దుండగులు అతని ఇంటిపై దాడి చేశారు. సుఖరాం ముక్కు, చెవులు కోసేసి, కాలు విరగ్గొట్టి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సుఖరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. కొంతమంది వ్యక్తులు, ఆమె కుమార్తె మాజీ అత్తమామలు అతనిని కొట్టి, అతని ముక్కు మరియు చెవులను కత్తిరించారు. దాడిలో అతని కాలు కూడా విరిగిందని ఏఎస్సై అచలరాం తెలిపారు
(The above story first appeared on LatestLY on Sep 14, 2022 07:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

