Rajasthan Shocker: ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి, పూజారిని నాలుగు ముక్కలుగా నరికి చంపిన తోటి సాధువులు, రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ జిల్లాలో దారుణ ఘటన

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ జిల్లాలో Bhim Singh గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక సాధువును దారుణంగా హత్య చేసి ఆయన శరీరాన్ని నాలుగు ముక్కలుగా నరికి నది సమీపంలో పడేశారు. మృతుడ్ని 60 ఏళ్ల మహముద్దీన్ ఖాన్‌గా గుర్తించారు.

Rajasthan Shocker: ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి, పూజారిని నాలుగు ముక్కలుగా నరికి చంపిన తోటి సాధువులు, రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ జిల్లాలో దారుణ ఘటన
Murder (Photo Credits: Pixabay)

Dholpur, Dec 22: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ జిల్లాలో Bhim Singh గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక సాధువును దారుణంగా హత్య చేసి ఆయన శరీరాన్ని నాలుగు ముక్కలుగా నరికి నది సమీపంలో పడేశారు. మృతుడ్ని 60 ఏళ్ల మహముద్దీన్ ఖాన్‌గా గుర్తించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధోల్‌పూర్‌లోని భీమ్‌ఘర్ గ్రామానికి చెందిన ఖాన్ చాలా కాలం కిందట మతం మారారు.

పెళ్లికి ఒప్పుకోలేదని నడిరోడ్డు మీద లవర్‌ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం, మృతి చెందిన ప్రియురాలు

ధోల్‌పూర్‌ జిల్లాలోని చామర్ మాత ఆలయంలో పదేళ్లుగా పూజారిగా ఉన్నారు. అయితే బుధవారం నాలుగు ముక్కలుగా నరికి (Headless Body Of Missing Seer) ఉన్న ఖాన్‌ మృతదేహం ఒక నది సమీపంలో పడి ఉండటం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు (Dholpur Police) సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాలుగు ముక్కలుగా నరికి పడేసిన ఖాన్‌ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

టీచరమ్మపై మరో టీచర్ దారుణం, అందుకు ఒప్పుకోలేదని ఆమె కొడుకు తలను గోడకేసి బాది, స్కూల్‌ బిల్డింగ్‌ పైనుంచి కిందకు పడేసి హత్య, కర్ణాటకలో దారుణ ఘటన

ఇటీవల కొందరు సాధువులతో ఆయనకు ఘర్షణ జరిగినట్లు తమకు తెలిసిందని Dholpur SP Dharmendra Singh తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాన్‌ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. ఆ సాధువులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిపైనే తమ అనుమానమని పోలీసు అధికారి తెలిపారు. ఖాన్‌ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Dec 22, 2022 08:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).