Rajasthan Shocker: రూంలో చపాతీలు చేయలేదని.. స్నేహితుడిని కత్తితో గొంతు కోసి చంపేసిన మరో ముగ్గురు స్నేహితులు, రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన

రూంలో చపాతీలు తయారు చేసే విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ స్నేహితుడి హత్యకు (three men slit his throat) దారితీసింది. నలుగురు స్నేహితుల్లో ఒకరైన జై ప్రకాశ్‌నారాయణ్ మీకోసం నేను చపాతీలు చేయను అని చెప్పడంతో మిగతా ముగ్గురితో వాగ్వాదం చోటు చేసుకుంది.

Rajasthan Shocker: రూంలో చపాతీలు చేయలేదని.. స్నేహితుడిని కత్తితో గొంతు కోసి చంపేసిన మరో ముగ్గురు స్నేహితులు, రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన
Representational Image (Photo Credits: Pixabay)

Jaipur, Nov 29: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చపాతీలు చేయలేదని (prepare chapattis)ఓ వ్యక్తిని స్నేహితులు చంపేశారు. జైపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా (45), లీలా రామ్ మీనా (36), గంగా లహేరి (35), జై ప్రకాశ్‌ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. వారంతా ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు.

రూంలో చపాతీలు తయారు చేసే విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ స్నేహితుడి హత్యకు (three men slit his throat) దారితీసింది. నలుగురు స్నేహితుల్లో ఒకరైన జై ప్రకాశ్‌నారాయణ్ మీకోసం నేను చపాతీలు చేయను అని చెప్పడంతో మిగతా ముగ్గురితో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురి పై అతను అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ముగ్గురు ఆవేశంతో జైప్రకాశ్‌ నారాయణని చంపేయాలని నిర్ణయించుకున్నారు.

భర్త చికెన్ తిన్నాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య, ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన, శ్రావణ మాసం రోజున వద్దన్నా భర్త చికెన్ తినడంతో ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకున్న భార్య

అనుకున్నదే తడువుగా జై నారాయణ్ వాష్‌రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి గొంతుకోసి (Youth bleeds to death) చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి వెళ్లిపోయారు. ఈ మేరకు జైపూర్‌ పోలీసుల ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

(The above story first appeared on LatestLY on Nov 29, 2021 08:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).