Chhattisgarh: భర్త చికెన్ తిన్నాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య, ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన, శ్రావణ మాసం రోజున వద్దన్నా భర్త చికెన్ తినడంతో ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకున్న భార్య

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంద.ి శ్రావణ మాసం రోజున భర్త చికెన్​ తిన్నాడని కోపంతో ఓ మహిళ క్షణికావేశంలో తన ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య (Wife commits suicide) చేసుకుంది. కరౌదా గ్రామానికి చెందిన​ ఓ వ్యక్తి ఆగస్టు 22న శ్రావణ మాసం చివరి రోజున తన బంధువుల ఇంట్లో చికెన్​ తినడమే ఈ దారుణానికి కారణమైంది.

Chhattisgarh: భర్త చికెన్ తిన్నాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య, ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన, శ్రావణ మాసం రోజున వద్దన్నా భర్త చికెన్ తినడంతో ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకున్న భార్య
Representational Image (Photo Credits: ANI)

Ambikapur, August 24: ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంద.ి శ్రావణ మాసం రోజున భర్త చికెన్​ తిన్నాడని కోపంతో ఓ మహిళ క్షణికావేశంలో తన ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య (Wife commits suicide) చేసుకుంది. కరౌదా గ్రామానికి చెందిన​ ఓ వ్యక్తి ఆగస్టు 22న శ్రావణ మాసం చివరి రోజున తన బంధువుల ఇంట్లో చికెన్​ తినడమే ఈ దారుణానికి కారణమైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీషా సింగ్ (19) ఆదివారం రక్షా బంధన్ రోజున తన భర్త రామజన్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రానికి వచ్చారు. ఇంతలో రామజన్మ పొరుగున ఉన్న తన అత్త ఇంటికి వెళ్లి చికెన్‌ తింటుండగా (husband eating chicken) ఆమె వద్దని వారించింది.అయినా రామ్‌జన్మ తన భార్య మాటను పెడచెవిన పెట్టి తిన్నాడు. శ్రావణ్‌ మాసం చివరి రోజు, రక్షాబంధన్‌ కూడా కనుక చికెన్ తినడం ద్వారా పొరపాటు చేస్తున్నావని మనీషా తన భర్తకు చెప్పి అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్లిపోయింది.

భర్త తాగుబోతు, వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, హెచ్చరించడంతో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

కాసేపటి తర్వాత రామజన్మ ఆమెకు నచ్చజెప్పడానికి ఇంటికి వెళ్లగా, అప్పటికే ఆమె క్షణికావేశంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. అతను తన భార్యను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే శరీరం చాలా మేరకు కాలిపోయింది. వెంటనే ఆమెను అంబికాపుర్​ మెడికల్​ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

(The above story first appeared on LatestLY on Aug 24, 2021 03:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).