Sam Pitroda Resigns: భారతీయుల రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా, వెంటనే ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (Indian Overseas Congress) చైర్మన్ శామ్ పిట్రోడా (Sam Pitroda) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సొంత సమ్మతిపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెంటనే ఆమోదించారని పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి జైరామ్ రమేష్ (Jairam Ramesh) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలియజేశారు.
భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్‌కు చేరింది. రూ. 2.5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మార్చి మీకు అత్యధిక ఓట్లు పడేలా చేస్తా, శివసేన నేతతో ఆర్మీ జవాన్ బేరసారాలు, గుట్టు రట్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు
వారసత్వ హక్కుపై ఇటీవల శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్లులా, పశ్చిమ భారతావని ప్రజలు అరబ్బులుగా, ఈస్ట్ ప్రజలు చైనీయుల్లా ఉండారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై ఇటు ప్రధానితో సహా బీజేపీనేతలు తప్పుపట్టగా, పార్టీకి పిట్రోడా వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది.
(The above story first appeared on LatestLY on May 08, 2024 09:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

