SC on Bribery Cases: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని స్పష్టం చేసిన ధర్మాసనం
ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.పార్లమెంట్, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.1998లో దీనిపై ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది.
- Read in
- తెలుగు
ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.పార్లమెంట్, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.1998లో దీనిపై ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా లంచాలు తీసుకుంటే విచారణ ఎదురుకోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
దీని ప్రకారం.. పార్లమెంటు/శాసనసభలో ఓటు/ప్రసంగానికి సంబంధించి లంచం ఆరోపణపై ఒక MP లేదా MLA ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు పొందలేరని తాజా తీర్పులో సుప్రీంకోర్టులో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది . గతంలో 1998 పివి నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది. చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్ , పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
Here's ANI News
Supreme Court says we disagree with the judgment in PV Narasimha and the judgment in PV Narasimha which grants immunity to legislators for allegedly bribery for casting a vote or speech has “wide ramifications and overruled”.
— ANI (@ANI) March 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 04, 2024 11:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

