Shiva Shankar Master: గంట గంటకూ క్షీణిస్తున్న శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం, కుటంబానికి కూడా కరోనా సోకడంతో దయనీయంగా పరిస్థితి

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, దీంతో చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి.

Shiva Shankar Master: గంట గంటకూ క్షీణిస్తున్న శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం, కుటంబానికి కూడా కరోనా సోకడంతో దయనీయంగా పరిస్థితి

Hyderabad November 25: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, దీంతో చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి.

శివశంకర్ మాస్టర్‌కు ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శివ శంకర్‌ మాస్టర్‌ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటుడిగానూ అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్‌ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు.

అటు శివశంకర్ మాస్టర్‌ కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఆయన భార్యకు కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అవ్వడంతో హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన తనయుడికి కూడా కరోనా రావడంతో ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 25, 2021 12:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).