Bihar Shocker: భార్య నల్లగా ఉందని కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన భర్త, హత్య తర్వాత ఐస్ బాక్స్‌లో పెట్టి ఏం చేశాడంటే?
కేవలం నల్లగా ఉందనే కారణంతో ఆమెను కడతేర్చాడు. తూర్పు చంపారన్ జిల్లా సంగ్రామ్ పూర్ పురందర్ పూర్ గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ షా, ప్రియాంక దేవి(23) భార్యభర్తలు. అయితే ప్రియాంక నల్లగా ఉంటుంది. ఇది భర్త శ్యామ్ లాల్ కు (Shyamlal) నచ్చేది కాదు. నువ్వు నల్లగా ఉన్నావు (Dark Complexion) అంటూ నిత్యం భార్యను తిట్టేవాడు.
Patna, AUG 30: భార్య నల్లగా ఉందని ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా కరెంట్ షాక్ ఇచ్చి ఆమెను చంపేశాడు. ఏంటి షాక్ అయ్యారా? కానీ, ఇది నిజమే. తన భార్య నల్లగా ఉందని ఆమెకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు భర్త. ఈ దారుణం బీహార్ (Bihar) లో జరిగింది. జీవితాంతం అన్ని విషయాల్లో తోడుగా ఉంటానని పెళ్లి సమయంలో మాటిచ్చిన భర్తే.. ఆమె పాలిట కాలయముడయ్యాడు. కేవలం నల్లగా ఉందనే కారణంతో ఆమెను కడతేర్చాడు. తూర్పు చంపారన్ జిల్లా సంగ్రామ్ పూర్ పురందర్ పూర్ గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ షా, ప్రియాంక దేవి(23) భార్యభర్తలు. అయితే ప్రియాంక నల్లగా ఉంటుంది. ఇది భర్త శ్యామ్ లాల్ కు (Shyamlal) నచ్చేది కాదు. నువ్వు నల్లగా ఉన్నావు (Dark Complexion) అంటూ నిత్యం భార్యను తిట్టేవాడు. నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా అని సూటిపోటి మాటలతో ఆమెను హింసించే వాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. సోమవారం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్త శ్యామ్ లాల్ సహనం కోల్పోయాడు. కోపంతో ఊగిపోయాడు. ఆవేశంలో భార్యకు కరెంట్ షాక్ ఇచ్చాడు. అంతే, ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.
భర్త శ్యామ్ లాల్ ను అరెస్ట్ చేశారు. శ్యామ్ లాల్ షా ఐస్ ఫ్యాక్టరీలో పని చేస్తాడు. భార్యను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఐస్ బాక్స్ లో దాచేందుకు ప్రయత్నించాడు. భార్య నల్లగా (Dark Complexion) ఉందని కరెంట్ షాక్ ఇచ్చి భర్తే చంపిన ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. వీడెవడండీ బాబూ అని అంతా తల పట్టుకున్నారు. పెళ్లి అయ్యాక.. నువ్వు నల్లగా ఉన్నావని ఆమెను వేధించే బదులు.. పెళ్లికి ముందే ఈ విషయం చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అని జనాలు మండిపడుతున్నారు. కేవలం నల్లగా ఉందనే కారణంతో భార్యను చంపిన ఆ భర్తను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 30, 2023 09:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

