Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 8 గంటలకు రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. వీటితోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు, నాందేడ్‌, వయనాడ్‌ (Wayanad) లోక్‌సభ స్థానాల (ఉపఎన్నికల) ఓట్లను లెక్కించనున్నారు

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే
Maharashtra Assembly Election Result 2024 (Photo Credits: LatestLY)

Mumbai, NOV 22: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 8 గంటలకు రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. వీటితోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు, నాందేడ్‌, వయనాడ్‌ (Wayanad) లోక్‌సభ స్థానాల (ఉపఎన్నికల) ఓట్లను లెక్కించనున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ పోరు హోరాహోరీగా (Counting in Maharashtra)సాగగా.. సీఎం ఎవరు కానున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలతోపాటు నాందేడ్‌ లోక్‌సభకు ఇటీవల ఓటింగ్‌ జరిగింది. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 61.1శాతం పోలింగ్‌ నమోదు కాగా.. తాజా ఎన్నికల్లో 66.05శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడం మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో 1991లో మహారాష్ట్రలో అత్యధికంగా 71.7శాతం నమోదైంది.

PM Modi At Guyana Parliament: ఇది యుద్ధాల శ‌కం కాదు! గ‌యానా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌ల‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పంద‌న‌ 

శనివారం ఉదయం 8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ( Counting) ప్రారంభం కానుండగా.. 9 గంటల నుంచి ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున 288 మంది అబ్జర్వర్లతో పర్యవేక్షణ కొనసాగనుంది. నాందేడ్‌ లోక్‌సభ లెక్కింపును ప్రత్యేకంగా ఇద్దరు అబ్జర్వర్లు పర్యవేక్షించనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం 1732 టేబుళ్లు, ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ (ETPBS)ల కోసం 592 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో విజయంపై అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏలు కూటములు ధీమాగా ఉన్నాయి.

KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు! 

జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగగా.. తొలిసారిగా 67.74శాతం పోలింగ్‌ నమోదయ్యింది. నవంబర్‌ 15, 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈస్థాయిలో పోలింగ్‌ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక్కడ నవంబర్‌ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. అధికార జేఎంఎం (JMM) మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, విపక్ష ఎన్డీయే కూడా తమదే విజయం ఖాయమని చెబుతోంది. ఇటీవల వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ జార్ఖండ్‌లో ఎన్డీయేవైపు (NDA) మొగ్గు చూపాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ సహా 13 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాల (ఉప ఎన్నికల) ఓట్ల లెక్కింపు కూడా శనివారం జరగనుంది.

(The above story first appeared on LatestLY on Nov 22, 2024 10:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).