Hyd, Nov 22: ఓ వైపు ఓటమి మరోవైపు నేతల పార్టీ జంప్ దీనికి తోడు ఎమ్మెల్యేల ఫిరాయింపులు వెరసీ గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు. దీంతో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం బీఆర్ఎస్ నేతలకు కీలకంగా మారింది. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి కేసీఆర్‌ది. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ఉంటుందా? ఉండదా అనే సందేహం కూడా అందరిలో నెలకొంది. కానీ ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వేసిన త్రిముఖ వ్యూహం ఫలించింది. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్ పడింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులు బీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేశారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తుండటంతో ఓ దశలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ తప్ప ఎవరూ ఉండరంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ నేతలు.
ఓ వైపు న్యాయపోరాటం, మరోవైపు ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్‌పై పోరు దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత లేకపోవడం, అనర్హత వేటు వెరసీ కాంగ్రెస్‌లో చేరాలనుకున్న నేతలంతా బ్యాక్ స్టెప్ వేశారు.
మూసీ, హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. మూసీ బాధితులకు అండగా ఉండేలా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నిరసనలు చేపట్టింది. అధికారులపై జరిగిన దాడి ఘటనలో గిరిజన రైతులను అరెస్టు చేసి వారిని చిత్రహింసలకు గురి చేశారని ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడంలో విజయవంతమైంది బీఆర్ఎస్. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు, రూ.10 కోట్లు కేసీఆర్ ఇచ్చారని ప్రభుత్వ తరపు లాయర్ ప్రస్తావన, మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆధారాలు సమర్పణ
ఇక బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకోవాలంటే ఆ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు వెనకగుడు వేసే పరిస్థితి నెలకొంది. అంతేగాదు బీఆర్ఎస్‌ను వీడిన పదిమంది ఎమ్మెల్యేల్లో కొంతమంది తిరిగి గులాబీ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదే గనుక జరిగితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. మొత్తంగా రాజకీయంగా ఎంత ఒత్తిడి వచ్చినా సైలెంట్‌గా ఉన్న కేసీఆర్..తన మాస్టర్ ప్లాన్‌తో బీఆర్ఎస్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేశారనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.