Sudden Death in Karnataka: కర్ణాటకలో విషాదం, గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి, పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా కుప్పకూలిన విద్యార్థిని

కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న 13 ఏళ్ల బాలిక బుధవారం గుండెపోటుతో మృతి చెందింది. బాలికను ముదిగెరె తాలూకాలోని కేశవలు జోగన్ననకెరె గ్రామానికి చెందిన 13 ఏళ్ల సృష్టిగా గుర్తించారు.

Sudden Death in Karnataka: కర్ణాటకలో విషాదం, గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి, పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా  కుప్పకూలిన విద్యార్థిని
Heart Attack. (Photo Credits: Pixabay)

చిక్కమగళూరు, డిసెంబర్ 20: కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న 13 ఏళ్ల బాలిక బుధవారం గుండెపోటుతో మృతి చెందింది. బాలికను ముదిగెరె తాలూకాలోని కేశవలు జోగన్ననకెరె గ్రామానికి చెందిన 13 ఏళ్ల సృష్టిగా గుర్తించారు. 7వ తరగతి చదువుతున్న సృష్టి అనే విద్యార్థిని దారదహళ్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.

కర్ణాటకలో దారుణం, పాఠశాలకు వెళుతున్న 10 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఆమెను ముదిగెరె పట్టణంలోని ప్రభుత్వ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

(The above story first appeared on LatestLY on Dec 20, 2023 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).