Sukhbir Singh Badal Attacked: వీడియో ఇదిగో.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి.. మహారాష్ట్ర నాందేడ్‌లో గురుద్వారా వద్ద కలకలం
శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి Sukhbir Singh Badalపై మహారాష్ట్రలోని నాందేడ్‌లో బుధవారం దాడి జరిగింది. ప్రసిద్ధ సిక్కు పుణ్యక్షేత్రం తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Sukhbir Singh Badal Attacked: శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి Sukhbir Singh Badalపై మహారాష్ట్రలోని నాందేడ్‌లో బుధవారం దాడి జరిగింది. ప్రసిద్ధ సిక్కు పుణ్యక్షేత్రం తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ నిహంగ్ సిక్కు కిర్పన్‌తో దాడికి ప్రయత్నించాడు. ఘటన సమయంలో బాదల్ వెంట ఆయన భార్య, ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఉన్నారు.
దాడి ప్రయత్నాన్ని గమనించిన సుఖ్‌బీర్ బాదల్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిలో కొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. దాడి అనంతరం సుఖ్‌బీర్ బాదల్‌ను చికిత్స కోసం నాందేడ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన కుడిచేతికి గాయం కావడంతో కాషాయ రంగు వస్త్రాన్ని చుట్టుకుని ఆసుపత్రికి వెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యులు పరీక్షించిన అనంతరం ఆయన పరిస్థితి ప్రమాదకరంగా లేదని వెల్లడించినట్లు సమాచారం. దీంతో అకాలీదళ్ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడికి గల కారణాలు, నిందితుడి నేపథ్యం, ఘటనకు ముందు అతడి కదలికలు వంటి అంశాలపై మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో నాందేడ్‌లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నాయకులు, మతపరమైన ప్రదేశాలను సందర్శించే సమయంలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది.
Sukhbir Singh Badal Attacked With Sword in Nanded
సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై గతంలోనూ దాడి ప్రయత్నం జరిగింది. 2024 డిసెంబర్ 4న అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద సేవాదార్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తాజాగా నాందేడ్‌లో మరోసారి దాడి జరగడం రాజకీయ, సిక్కు వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.