Supreme Court on PG Medical Admissions: పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రాష్ట్రాల కోటా చెల్లదని స్పష్టం
పీజీ మెడికల్ సీట్లపై సంచలన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) వెలువరించింది. పీజీ మెడికల్ సీట్లలో (PG Medical Seats) రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం చేసింది. నీట్ మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని తీర్పులో వెల్లడించింది
New Delhi, JAN 29: పీజీ మెడికల్ సీట్లపై సంచలన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) వెలువరించింది. పీజీ మెడికల్ సీట్లలో (PG Medical Seats) రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం చేసింది. నీట్ మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని తీర్పులో వెల్లడించింది. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు కుదరవని తేల్చి చెప్పింది. పీజీ మెడికల్ సీట్లలో నివాస ప్రాంతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఏమాత్రం ఆమోగ్యయోగ్యం కాదని.. అలా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ని ఉల్లంఘించడమే అవుతుందని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం అభిప్రాయపడింది.
మనమంతా భారత భూభాగంలోనే నివసిస్తున్నామని.. ప్రాంతీయ, రాష్ట్ర నివాసం అంటూ ఏమీ లేదని.. ఒకే నివాసం ఉందని.. మనమందరం భారతదేశ పౌరులమని ధర్మాసనం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ప్రవేశాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగం మనకు ఇచ్చిందని తెలిపింది. భవిష్యత్ అడ్మిషన్ల కోసం నివాస రిజర్వేషన్లను పక్కనపెడుతూ.. ఇప్పటికే విద్యార్థులకు మంజూరు చేసిన నివాస రిజర్వేషన్లను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. నీట్ పీజీ మెడికల్ అడ్మిషన్స్ నివాస రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు విద్యార్థులు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 10:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

