Tamil Nadu Shocker: ట్యూషన్ టీచర్ ఆపనికి ఒప్పుకోలేదని మైనర్ బాలుడు దారుణం, తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, ఇంతకీ ఏం చేసాడంటే..
తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడ్డ ఓ 17 ఏళ్ల బాలుడు ఆమె తనను దూరం పెట్టిందని వేధింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.
Chennai, July 25: తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడ్డ ఓ 17 ఏళ్ల బాలుడు ఆమె తనను దూరం పెట్టిందని వేధింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.
ఘటన వివరాల్లోకెళితే.. 17 యేళ్ళ మైనర్ బాలుడు... 22 యేళ్ల మహిళా టీచర్ వద్దకు ప్రతి రోజూ టూషన్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ టీచర్‌ను మైనర్ బాలుడు ప్రేమించసాగాడు. అతని ప్రేమను గ్రహించిన ఆ టీచర్ (tuition teacher ) కూడా సమ్మతం తెలిపింది.కొన్ని రోజులు కలిసి తిరిగిన తర్వాత టీచర్ తప్పు చేస్తున్నానని గ్రహించి బాలుడిని దూరం పెట్టింది. టీచర్ తనను దూరం పెట్టిందనే కోపంతో బాలుడు వినూత్న వేధింపులకు (Teen stalker uses online delivery apps) దిగాడు. ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్‌లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబెర్ రైడ్లు బుక్ చేశాడు. ఏపీలో మరో దారుణం, రెండో పెళ్ళి చేసుకుందని మహిళను చెట్టుకు కట్టేసి కర్రలతో, కోడి గుడ్లతో దాడిచేసిన సాటి మహిళలు, వీడియో ఇదిగో..
తమ ఇంటికి వరుసపెట్టి వస్తున్న డెలివరీ ఏజెంట్లు, డ్రైవర్లకు సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది. చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎవరో గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు ఈ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ- మెయిల్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి.. రెండు సెల్‌ఫోన్లు, వైఫై రౌటర్లను సీజ్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా నిందితుడి మానసిక ఆరోగ్యం గురించి కౌన్సెలింగ్ చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది.
(The above story first appeared on LatestLY on Jul 25, 2024 01:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

