అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మరో పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి సాటి మహిళలే ఆమెను దారుణంగా హింసించారు. ఇటీవల భర్త నుంచి విడిపోయిన బాధిత మహిళ మరో పెళ్లి చేసుకున్నట్టు తెలియడంతో జీర్ణించుకోలేకపోయిన గ్రామంలోని మహిళలు ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆపై తప్పు చేసిందంటూ విచక్షణ రహితంగా ప్రవర్తించారు. కర్రలతో ఆమెను కొడుతూ, కోడిగుడ్లతో దాడిచేస్తూ ఆమెను నానా హింసకు గురిచేశారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె నుంచి ఫిర్యాదు అందుకున్న అనంతరం చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఇదిగో, చిన్న గొడవకే డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి చంపిన మరో డ్రైవర్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో
Here's Video
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారి పాలెం లో అమానుషమైన ఘటన ఘోరం.
మహిళను చెట్టుకు కట్టేసి కట్టే లతో కొడుతూ చిత్రహింసలు పెడుతూ కోడిగుడ్లతో దాడి.
గదిలో బంధించి బట్టలు ఊడదీసి హత్యాయత్నం.
స్థానికుల సమాచారంతో బాధితురాలుని వీరబల్లి స్టేషన్‌కు తీసుకు వెళ్లిన పోలీసులు. pic.twitter.com/S8AMs8ZRSW
— YSRCP Brigade (@YSRCPBrigade) July 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)