Vemulawada lady home guard Anusha blackmailed Rich Persons for money,

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డు సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో డబ్బును గుంజుతూ పోలీసులకు చిక్కింది.హోమ్ గార్డు వడ్ల అనూష వసూళ్ల కోసం మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్‌(Dwaraka shekar)ను అనూష బ్లాక్‌ మెయిల్‌ చేసింది.

లైంగిక వేధింపులు..కామారెడ్డి జిల్లాలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్య...దుబాయ్‌లో ఉంటున్న మృతురాలి భర్త, స్థానికంగా విషాదం

రూ. 3 లక్షల 50 వేలు అప్పుగా తీసుకొని , తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి అతనిని బ్లాక్ మెయిల్ చేసింది. ఈ ఫోటోలతో 5 లక్షల డిమాండ్ చేయగా పరువు పోతుందనే భయంతో ద్వారకా శేఖర్‌ ఆమెకు ఆ డబ్బును ఇచ్చాడు. అది సరిపోక మరోసారి 3 లక్షలు ఇవ్వాలని అనూష డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Rajanna Temple)లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది అనూష. ఈకిలేడీ హోంగార్డు బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.

lady home guard Anusha blackmailed Rich Persons for money