Pickup Vans For TGSRTC Passengers: ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్, దూర ప్రాంత ప్ర‌యాణికుల కోసం పికప్ వ్యాన్లు, తొలుత ఈ రూట్ లో ప్రారంభం

దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల (Pick Up vans) సేవలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి విడతలో ఈసీఐఎల్‌- ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది.

Pickup Vans For TGSRTC Passengers: ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్, దూర ప్రాంత ప్ర‌యాణికుల కోసం పికప్ వ్యాన్లు, తొలుత ఈ రూట్ లో ప్రారంభం
TSRTC Bus (Credits: X)

Hyderabad, DEC 06: దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల (Pick Up vans) సేవలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి విడతలో ఈసీఐఎల్‌- ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వెళ్లేవారి కోసం ఈ పికప్‌ వ్యాన్‌లు ఏర్పాటు చేశారు.

Telangana: తెలంగాణలో హోంగార్డుల దినసరి భత్యం రూ.921 నుంచి రూ.1000కి పెంపు, శుభవార్తను అందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

కాప్రా మున్సిపల్‌ కాంప్లెక్‌, మౌలాలీ హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్‌, హెచ్‌ఎంటీ నగర్‌, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌, నాగోల్‌, సుప్రజ ఆస్పత్రి, ఎల్బీనగర్‌ ఎల్‌పీటీ మార్కెట్‌ నుంచి పికప్‌ వ్యాన్‌లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ తెలిపింది.

(The above story first appeared on LatestLY on Dec 06, 2024 10:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).