రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.ఈ ఉత్సవాల్లో తాజాగా హోంగార్డులకు శుభవార్తను అందించింది ప్రభుత్వం. హోంగార్డుల జీతాలు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి కీల ప్రకటన చేశారు.హోంగార్డులకు దినసరి భత్యం రూ.920 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం

అంతేకాకుండా వీక్లీ పరేడ్ అలవెన్సులను వంద రూపాయల నుంచి రూ.200 కు పెంచుతున్నట్టు తెలిపారు. ఈ పెంచిన జీతాలు జనవరి నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హోంగార్డులు విధి నిర్వాహణలో చనిపోతే.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిచనున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక మరణించి ఐపీఎస్ కుటుంబానికి 2 కోట్ల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.హోంగార్డులకు ఆరోగ్య శ్రీ హెల్త్ స్కీమ్ వర్తింపును పరిశీలిస్తున్నామని తెలిపారు.

Daily allowance of home guards increased from Rs.921 to Rs.1000 in Telangana

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)