Stamp Duty: స్టాంప్ డ్యూటీపై కేంద్రం కీలక ప్రకటన, పెంచుకునే అధికారం రాష్ట్రాలకే అప్పజెబుతూ నిర్ణయం, మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక స్టాంప్ డ్యూటీపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Stamp Duty: స్టాంప్ డ్యూటీపై కేంద్రం కీలక ప్రకటన, పెంచుకునే అధికారం రాష్ట్రాలకే అప్పజెబుతూ నిర్ణయం, మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇక స్టాంప్ డ్యూటీపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పజెప్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.  కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులకు అలర్ట్, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000 కుపెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటన

అదేసమయంలో మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక ఎన్‌పీఎస్‌ పథకంలో మార్పులు చేస్తూ మైనర్లు కూడా చేరేందుకు వీలు కల్పించారు. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లను కేంద్రం ఈ బడ్జెట్ లో కేటాయించింది. ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Jul 23, 2024 01:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).