Newdelhi, June 24: ఇప్పటివరకూ ప్రమోషన్ (Promotion) గురించే విన్నాం. డిమోషన్ (Demotion) గురించి విన్నారా? యూపీలోని ఓ పోలీసుకు డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్ చేశారు. అసలేం జరిగిందంటే.. యూపీలోని ఉన్నావోలోని కన్నౌజియాలో డీఎస్పీగా పనిచేస్తున్న కృపాశంకర్ 2021లో సెలవు తీసుకున్నాడు. అయితే, ఆయన ఇంటికి వెళ్లకుండా లేడీ కానిస్టేబుల్ తో హోటల్ కు వెళ్లాడు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసు బృందం అక్కడికి వెళ్లి లేడీ కానిస్టేబుల్ తో హోటల్ లో ఉన్న డీఎస్పీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
🛑🛑 UP DSP Kripa Shankar Kanaujia Demoted to Constable Due to Extra-Marital Affair With Colleague. 🤔🤔
Three years ago he was caught in a compromising situation with a female constable at a hotel. 😋😋😋👇 pic.twitter.com/EwZ4wRWzxk
— Naren Mukherjee (@NMukherjee6) June 24, 2024
పోలీసుల దర్యాప్తు ఇలా..
దర్యాప్తు చేసిన పోలీసు డిపార్ట్ మెంట్ కృపాశంకర్ తప్పును గుర్తించారు. దీంతో అతన్ని డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.