Malls (photo credits: Flickr)

Hyderabad, June 24: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక ఆదేశాలు  జారీ చేశారు. ఇకపై తెలంగాణలోని షాపులు (Commercial Establishments Close), ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 లోపు కట్టేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తాము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఇటీవల కాలంలో నేరాల తీవ్రత పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

అంచ‌నాల‌ను అమాంతం పెంచిన క‌ల్కి రిలీజ్ ట్రైల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ మూవీ ట్రైల‌ర్ కు ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం

ప్రజలకు సూచనలు

ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. రాత్రుళ్లు అనవసరంగా వీధుల్లో తిరగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రిళ్లు ముక్కుముఖం తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని అన్నారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు 

వ్యాపారుల ఆగ్రహం

పోలీసుల తాజా ఆదేశాలపై వ్యాపారులు, ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలోమారిన ప్రజల జీవనశైలి, నైట్‌ లైఫ్‌ పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. చార్మినార్ పరిసరాల్లో అర్ధరాత్రి వరకూ జనాల సందడి ఉంటుందని స్థానిక వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. కాబట్టి అర్ధరాత్రి వరకూ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతించాలని అన్నారు. తమ జీవనోపాధిని దెబ్బతీయోద్దని అభ్యర్థించారు.