UP Horror:యూపీలో మరో దారుణం, ఆస్పత్రిలోనే నర్సుని దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన కామాంధులు, సామూహిక అత్యాచారం, హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం (UP Horror) జరిగింది. విధుల్లో చేరిన తొలి రోజే ఓ నర్సు సామూహిక అత్యాచారానికి గురైంది. ఆపై విగతజీవిగా మారింది. కొందరు దుండగులు 19 ఏళ్ల ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి.. అతి కిరాతకంగా చంపేశారు.
Lucknow, May 2: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం (UP Horror) జరిగింది. విధుల్లో చేరిన తొలి రోజే ఓ నర్సు సామూహిక అత్యాచారానికి గురైంది. ఆపై విగతజీవిగా మారింది. కొందరు దుండగులు 19 ఏళ్ల ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి.. అతి కిరాతకంగా చంపేశారు. బిల్డింగ్ పై నుంచి వేలాడదీసి ఉరేసి ప్రాణం (Young Nurse found hanging in UP hospital) తీశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా దుల్లాపూర్వ గ్రామంలో నిర్మించిన న్యూ జీవన్ ఆసుపత్రిలో నిన్న జరిగింది.
శనివారం ఉదయం బిల్డింగ్ పైనుంచి వేలాడుతున్న నర్సు మృతదేహాన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె చేతులు కట్టేసి ఉన్నాయని నిర్ధారించారు. శుక్రవారం రాత్రి ఆమె నైట్ డ్యూటీ చేసిందని, ఆసుపత్రిలోనే నిద్రపోయిందని పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అయితే, బాధితురాలి తల్లిదండ్రులు ఇది ముమ్మాటికీ గ్యాంగ్ రేపేనని, ఆ తర్వాత తన కూతురును చంపేశారని ఆరోపించారు.
దీంతో పోలీసులు సామూహిక అత్యాచారం, హత్య కేసుగా (case of gang rape-murder lodged) నమోదు చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న్యూ జీవన్ ఆసుపత్రిని ఏప్రిల్ 25న బంగార్మౌ ఎమ్మెల్యే శ్రీకాంత్ కటియార్ ప్రారంభించారు.
(The above story first appeared on LatestLY on May 02, 2022 03:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

