UP Shocker: యూపీలో 5 ఏళ్ల చిన్నారిపై దారుణం, అక్కడ రక్తం కారుతూ నొప్పితో విలవిలలాడుతున్నా వదలని 60 ఏళ్ళ వృద్ధ కామాంధుడు, అత్యాచారం విషయం పోలీసులకు తెలియడంతో భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేండ్ల బాలికపై 60 ఏండ్ల వృద్ధుడు కామాంధుడిలా మారిపోయి అత్యాచారం చేశాడు. చిన్నారిపై అత్యాచారం చేసి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఫరీద్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
Lucknow, Oct 10: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేండ్ల బాలికపై 60 ఏండ్ల వృద్ధుడు కామాంధుడిలా మారిపోయి అత్యాచారం చేశాడు. చిన్నారిపై అత్యాచారం చేసి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని ఫరీద్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీద్‌పూర్ పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఐదేండ్ల చిన్నారి.. ఆడుకునేందుకు తన ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆడుకుంటున్న బాలికపై షేర్ మహ్మద్(60) అనే వృద్ధుడు కన్నేశాడు. మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారం చేశాడు.
బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. ఆమె ఆచూకీ కోసం వెతికారు. షేర్ మహ్మద్ ఇంట్లోకి వెళ్లి చూడగా, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. మహ్మద్ అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తప్పించుకున్న మహ్మద్.. గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయంతోనే మహ్మద్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు. వృద్ధుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
(The above story first appeared on LatestLY on Oct 10, 2023 12:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

