Uttar Pradesh Horror: ప్రియురాలి మోజులో భార్యపై దారుణం, కత్తితో ఆమె ముక్కు కోసి జేబులో పెట్టుకుని పరారయిన కసాయి భర్త, నిందితుడు అరెస్ట్..

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్ల్‌ఫ్రెండ్‌ మోజులో పడిన ఒక యువకుడు మారణాయుధంతో తన భార్య ముక్కును తెగ్గోసి, దానిని జేబులో పెట్టుకుని పరారయ్యాడు. రక్తమోడున్న ముక్కుతోనే ఆ భార్య పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి భర్త చేసిన నిర్వాకంపై ఫిర్యాదు చేసింది.

Uttar Pradesh Horror: ప్రియురాలి మోజులో భార్యపై దారుణం, కత్తితో ఆమె ముక్కు కోసి జేబులో పెట్టుకుని పరారయిన కసాయి భర్త, నిందితుడు అరెస్ట్..
Murder (Photo Credits: Pixabay)

Lucknow, July 3: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్ల్‌ఫ్రెండ్‌ మోజులో పడిన ఒక యువకుడు మారణాయుధంతో తన భార్య ముక్కును తెగ్గోసి, దానిని జేబులో పెట్టుకుని పరారయ్యాడు. రక్తమోడున్న ముక్కుతోనే ఆ భార్య పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి భర్త చేసిన నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

దారుణ ఘటన వివరాల్లోకెళితే.. బన్‌స్తలి గ్రామానికి చెందిన విక్రమ్‌కు మహ్మదాబాద్ గ్రామానికి చెందిన సీమా దేవితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇంతలో గ్రామానికి చెందిన మరో మహిళతో విక్రమ్‌కు సంబంధం మొదలైంది. ఈ విషయం సీమకు తెలియడంతో ఆమె వ్యతిరేకించింది.ఈ విషయమై ఇంట్లో ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరిగేవి.

రేపిస్టు జననాంగాలను కోసేసిన మహిళ.. బీహార్ లో ఘటన

బాధితురాలి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8:00 గంటల ప్రాంతంలో విక్రమ్ మొదట ఆహారం వండమని అడిగాడు. ఆ తర్వాత మళ్లీ ఆ మహిళ విషయంలో వారి మధ్య గొడవ మొదలైంది. అందుకే విక్రమ్ భార్య మీద కోపాన్ని కూతురి మీద చూపించాడు. అతను ఆమెను కొట్టడం ప్రారంభించినప్పుడు, భార్య సీమ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇంతలో విక్రమ్ పదునైన ఆయుధంతో భార్య ముక్కు కోసేశాడు. తర్వాత జేబులో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

రక్తస్రావం అయిన భార్య అదే స్థితిలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బాధితురాలి భార్య సీమాదేవి ఫిర్యాదు మేరకు నిందితుడు భర్త విక్రమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు సీమాదేవిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు నిందితుడైన భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు, అక్కడ నుండి జైలుకు పంపించారు. కేసు దర్యాప్తులో ఉంది.

(The above story first appeared on LatestLY on Jul 03, 2023 11:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).