Uttar Pradesh Horror: యూపీలో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను గొంతు కోసి చంపేసిన భార్య, మృతదేహాన్ని ఇంట్లోనే మరుగుదొడ్డిలో పాతిపెట్టిన ఇల్లాలు

25 ఏళ్ల యువతి, తన ప్రియుడితో కలిసి భర్తను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని తమ ఇంటిలోని ఏడడుగుల లోతు మరుగుదొడ్డిలో పాతిపెట్టిన ఘటన ముజఫర్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ మహిళ అదే ఇంటిలో కొనసాగిందని పోలీసులు తెలిపారు

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను గొంతు కోసి చంపేసిన భార్య, మృతదేహాన్ని ఇంట్లోనే మరుగుదొడ్డిలో పాతిపెట్టిన ఇల్లాలు
Stabbed (file image)

Lucknow, June 16: 25 ఏళ్ల యువతి, తన ప్రియుడితో కలిసి భర్తను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని తమ ఇంటిలోని ఏడడుగుల లోతు మరుగుదొడ్డిలో పాతిపెట్టిన ఘటన ముజఫర్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ మహిళ అదే ఇంటిలో కొనసాగిందని పోలీసులు తెలిపారు.సాగర్ అహ్మద్ (30)గా గుర్తించిన బాధితుడి మృతదేహం దాదాపు 10 రోజుల తర్వాత గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. పుర్కాజి పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల గ్రామంలో ఈ హత్య జరగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆషియా అనే నిందితురాలు జూన్ 7న తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. విచారణలో, అదే ప్రాంతంలో నివసిస్తున్న సాగర్ సవతి సోదరుడు సుహైల్ అహ్మద్ (28)తో ఆషియాకు సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాంతో ఈ దారుణానికి ఒడిగట్టింది.

అర్ధరాత్రి ఇంట్లో మంటలు, తల్లితో సహా ఐదుగురు చిన్నారులు సజీవదహనం, మంటలకు ఒక్కసారిగా పేలిన సిలిండర్

పుర్కాజి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జ్ఞానేశ్వర్ కుమార్ మాట్లాడుతూ.. "విచారణలో సుహైల్‌తో కలిసి తన భర్తను గొంతుకోసి హత్య చేసి టాయిలెట్ పిట్‌లో పాతిపెట్టినట్లు ఆషియా అంగీకరించింది. ఇద్దరినీ అరెస్టు చేశాం" అని తెలిపారు. సంఘటనా స్థలానికి మేజిస్ట్రేట్‌ను పిలిపించామని, ఘటనాస్థలిని తవ్వి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించామని ఎస్పీ (నగరం), సత్యనారాయణ ప్రజాపతి తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jun 16, 2023 12:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).