Uttar Pradesh Horror: యూపీలో దారుణం, ఫోన్ తీసుకున్నందుకు భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య, అడ్డు వచ్చిన కొడుకుపై కూడా దాడి
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.నిత్యం మొబైల్‌లో గడుపుతున్న భార్య ఫోన్‌ను భర్త తీసుకున్నాడని కోపంతో ఇల్లాలు భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది. మొదట భర్తకు మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది.
Lucknow, May 31: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.నిత్యం మొబైల్‌లో గడుపుతున్న భార్య ఫోన్‌ను భర్త తీసుకున్నాడని కోపంతో ఇల్లాలు భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది. మొదట భర్తకు మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ షాక్ ఇస్తూ కొడుతూ రాక్షసత్వం ప్రదర్శించింది. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన 14 ఏళ్ల కుమారుడిపైన కూడా చేయి చేసుకుంది. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితుడు ప్రదీప్‌సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం అతడు సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. దారుణం, ఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసి ఘోరంగా హింసించిన భార్య, ఘట్కేసర్ పరిధిలో ఘటన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..2007లో ఔరయ్యకు చెందిన దివాన్ సింగ్ కుమార్తె బేబీ యాదవ్‌తో ప్రదీప్‌సింగ్‌కు వివాహమైంది. అతని భార్య తన మొబైల్ ఫోన్‌లో ప్రతిరోజూ ఎవరితోనో మాట్లాడేది. ఈ విషయమై ఆయన చాలా సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. వారి సూచన మేరకు భర్త ఆమె వద్ద నుంచి మొబైల్ ఫోన్ తీసుకున్నారు. అయితే ఇది ఆమెకు కోపం తెప్పించింది. ఫోన్ ఇచ్చేయాలని మొదట ఆమె భర్తను బెదిరించింది.కొడుకు చేసిన పనికి తల్లిపై దారుణం, అమ్మాయిని లేపుకుపోయాడని అబ్బాయి తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టివేసి కొట్టిన అమ్మాయి తరపు బంధువులు
ఈ క్రమంలో అతన్ని, అతని కొడుకును చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. ఆపై ఆమె భర్తను క్రికెట్ బ్యాట్‌తో పదే పదే కొట్టడం చేసింది. కొడుకు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది. రక్షించడానికి యత్నించిన కుమారుడిపై కూడా దాడి చేసింది" అని పోలీసులు తెలిపారు.
కిష్ని పోలీస్ స్టేషన్ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. భర్తపై వేధింపులకు పాల్పడిన బేబీ యాదవ్‌పై ఐపీసీ సెక్షన్లు 307 (హత్యకు ప్రయత్నించడం), 328 (నేరం చేయాలనే ఉద్దేశ్యంతో విషం ద్వారా గాయపరచడం మొదలైనవి), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
(The above story first appeared on LatestLY on May 31, 2024 01:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

