Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, శృంగారానికి ఒప్పుకోలేదని బాలుడిని దారుణంగా చంపిన మరో యువకుడు, చెరకు తోటలో మృతదేహం

యూపీలో రాంపూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై లైంగిక దాడికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. బాలుడు ప్రతిఘటించడంతో హత్య (Man Murders Boy After Rape Attempt Fail) చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరకు తోటలో దాచాడు. తల్లిదండ్రుల సమాచారంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, శృంగారానికి ఒప్పుకోలేదని బాలుడిని దారుణంగా చంపిన మరో యువకుడు, చెరకు తోటలో మృతదేహం
Representational Purpose Only (File Image)

Lucknow, Nov 10: యూపీలో రాంపూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై లైంగిక దాడికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. బాలుడు ప్రతిఘటించడంతో హత్య (Man Murders Boy After Rape Attempt Fail) చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరకు తోటలో దాచాడు. తల్లిదండ్రుల సమాచారంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బిలాస్‌పూర్‌కు చెందిన వ్యక్తి తన 8 ఏళ్ల కుమారుడు కిడ్నాప్‌ అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొరుగింట్లో అద్దెకు ఉండే 21 ఏళ్ల శివంపై అనుమానం వ్యక్తం చేశాడు. అతడు తన కుమారుడ్ని మభ్యపెట్టి బయటకు తీసుకెళ్లాడని ఆరోపించాడు. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా దీనిని గుర్తించినట్లు చెప్పాడు. కాగా, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు చివరకు చెరకు తోటలో దాచిన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రేమ వ్యవహారం, యువకుడి ప్రైవేట్ భాగాల్లో కారం చల్లి హత్య చేసిన యువతి కుటుంబ సభ్యులు, హైదరాబాద్‌లో దారుణ ఘటన

అలాగే రక్తం మరకలు ఉన్న బాలుడి దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడు అది విఫలం కావడంతో హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడు శివంను బుధవారం అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Nov 10, 2023 07:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).