Hyderabad Shocker: ప్రేమ వ్యవహారం, యువకుడి ప్రైవేట్ భాగాల్లో కారం చల్లి హత్య చేసిన యువతి కుటుంబ సభ్యులు, హైదరాబాద్‌లో దారుణ ఘటన
Representational image (photo credit- IANS)

Hyd, Nov 10: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమ కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో యువకున్ని లవర్ కుటుంబ సభ్యులు హత్య చేశారు. సంచలనం రేపిన ఈ హత్య బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ శివారు మేడ్చల్‌ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం ఘట్‌కేసర్‌ సమీపంలోని అన్నోజిగూడ శ్రీలక్ష్మీనరసింహ కాలనీకి చెందిన కరణ్‌నాయక్‌(18) నీరు సరఫరా చేసే ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తండ్రి మరణించగా తల్లి యాదిబాయ్‌తో కలిసి స్థానికంగా నివాసముంటున్నాడు. కరణ్‌కు.. అదే కాలనీలో నివాసముండే బాలిక(15)కు మధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది.

కర్ణాటకలో దారుణం, భార్యపై అనుమానంతో చున్నీ బిగించి హత్య చేసిన భర్త, అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు కరణ్‌ను చాలాసార్లు మందలించారు. అతడు మాత్రం బాలికను పదేపదే కలుస్తున్నాడు. ఎన్నిసార్లు మందలించినా ఇది కొనసాగడంతో బాలిక కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. బుధవారం బాలిక తల్లిదండ్రులు స్థానికంగా శుభకార్యానికి వెళ్లారు. అప్పుడు ఆమె ఇంట్లోనే ఉంది. అతడు అర్ధరాత్రి నేరుగా ఇంటికెళ్లాడు.

బెంగుళూరులో దారుణం, సహజీవనం చేస్తున్న జంట మంటల్లో సజీవ దహనం, దర్యాప్తులో ఏం తేలిందంటే..

స్థానికుల ద్వారా సమాచారం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు వెంటనే తిరిగివచ్చారు. కరణ్‌ తప్పించుకోకుండా ముందుగా బయట నుంచి గడియపెట్టారు. స్థానికంగా మరికొందర్ని పిలిపించుకుని ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించారు. యువకుడిని ఇష్టారీతిన కొట్టారు. నగ్నంగా చేసి తాళ్లతో కట్టేశారు. అతడి రహస్యభాగాలపై కారం చల్లుతూ.. కర్రలతో కొడుతూ దాదాపు గంటపాటు చిత్రవధ చేశారు. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొద్దిసేపటికే మరణించాడు.

స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి.. సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన బాలిక తల్లిదండ్రులు సహా 9 మందిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. స్థానికంగా అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు.