ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్రసింగ్ రావత్‌కు సోషల్ మీడియాలో షాక్ తగిలింది. రావత్‌ను పోలి ఉన్న వ్యక్తి బెడ్‌పై ఒక అమ్మాయితో అశ్లీల స్థితిలో లిక్కర్ గ్లాసు చేతిలో పట్టుకుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో వచ్చిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేశారని ఎంపీ కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలోనూ రావత్‌కు బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్లీ టికెట్ దక్కింది. అనంతరం ఈ మార్పింగ్ వీడియో వైరల్ అయింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్‌ను తప్పించి ఉపేంద్రసింగ్ రావత్‌కు బీజేపీ హైకమాండ్ టికెటివ్వగా ఆయన గెలిచారు. తాజాగా రెండోసారి ఉపేంద్రకు పార్టీ టికెట్ ప్రకటించింది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, 195 సీట్లతో తొలి జాబితా, వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ..400 సీట్లే లక్ష్యం
Here's Statement
बाराबंकी से बीजेपी सांसद उपेंद्र रावत ने अश्लील वीडियो वायरल होने के मामले में FIR कराई है.. https://t.co/2irsnYDOFS pic.twitter.com/cJUd7z3Sru
— Akhilesh Tiwari (अखिलेश तिवारी) (@Akhilesh_tiwa) March 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)