Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని రేప్ చేయబోయిన ఎస్సై, పట్టుకుని బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా లోపలికి ప్రవేశించి ఆమెను వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఓ ఎస్సైని పట్టుకుని చితకబాదారు. అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టారు.గ్రామస్థులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వ్యవహారం వైరల్‌గా మారింది.
- Read in
- తెలుగు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా లోపలికి ప్రవేశించి ఆమెను వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఓ ఎస్సైని పట్టుకుని చితకబాదారు. అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టారు.గ్రామస్థులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వ్యవహారం వైరల్‌గా మారింది. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఎస్సై సందీప్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
మరోవైపు, తనపై అత్యాచారానికి యత్నించాడంటూ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదైంది. సందీప్ కుమార్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దర్యాప్తు కోసం వెళ్లిన తనపై గ్రామస్థులే దాడి చేశారని ఆరోపించారు. సందీప్ రెండు సంవత్సరాల క్రితం పోలీసు శాఖలో జాయిన్ అయ్యారు.

Here's Video
आगरा: बरहन के तिहइया गांव के एक घर में आपत्तिजनक स्थिति में पकड़ गया दारोगा। ग्रामीणों ने दारोगा को नंगा करके खंभे से बांधा। पिटाई भी की।
नोट:- वीडियो के ऑडियो में अभद्र भाषा हो सकती है। pic.twitter.com/l5NGH5KAUv
— Shivam Yadav (@Shivam28Y1) September 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 19, 2023 12:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

