Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, మొబైల్ ఛాటింగ్ చేస్తుందని భార్యకు ఉరివేసి చంపేసాడు, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు

యూపీలోని ఉన్నావ్ లో దారుణ ఘటన (Uttar Pradesh Shocker) చోటు చేసుకుంది. ఓ యువకుడు తన భార్యను 'చీర'తో గొంతుకు ఉరివేసి చంపేసిన (Man Strangles Wife to Death With 'Saree) అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు.

Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, మొబైల్ ఛాటింగ్ చేస్తుందని భార్యకు ఉరివేసి చంపేసాడు, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు
Representational Image (Photo Credits: Pixabay)

Unnao, March 1: యూపీలోని ఉన్నావ్ లో దారుణ ఘటన (Uttar Pradesh Shocker) చోటు చేసుకుంది. ఓ యువకుడు తన భార్యను 'చీర'తో గొంతుకు ఉరివేసి చంపేసిన (Man Strangles Wife to Death With 'Saree) అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. ఉన్నావ్ జిల్లా హసన్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్‌పూర్ వడే గ్రామంలో ఈ దారుణం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలో ఉన్నావ్ జిల్లాలోని అరుణ్‌కి ఆర్తితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.

అతను ఇంటి సమీపంలోని ఓ దుకాణంలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులు గత కొన్నేళ్లుగా ఆరేళ్ల కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నారు.అయితే తన భార్య ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్‌ను వాడడంతో మనస్తాపం చెంది ఆమెను గొంతుకు చీర బిగించి చంపినట్లు పోలీసులకు తెలిపాడు. ఉన్నావ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, "అతని భార్య ఎవరితోనైనా ఎక్కువ గంటలు మొబైల్ ఫోన్‌లో చాట్ ( Chatting on Mobile Phone) చేసేది.

రెచ్చిపోయిన కామాంధుడు, 67 ఏండ్ల వృద్ధురాలి ఎదుట హస్తప్రయోగం, చూడమంటూ అసభ్యంగా సైగలు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

అతను ఆమె మొబైల్ తనిఖీ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె అతనితో గొడవ పడేది. సోమవారం ఆమె అతనితో గొడవ పడింది, ఆ తర్వాత అతను ఆమె గొంతు నులిమి చంపాడని తెలిపాడు. నిందితుడు అరుణ్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

(The above story first appeared on LatestLY on Mar 01, 2022 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).