Vadodara Boat Capsize: ఘోర పడవ ప్రమాదంలో 10 మందిని రక్షించిన పోలీసులు, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపిన గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్
గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు.
- Read in
- తెలుగు
గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు. సరస్సులో పడిపోయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ జనవరి 18, గురువారం వడోదర పడవ బోల్తా ఘటనను విచారకరమైన సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు పది మందిని రక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి కూడా తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, అవసరమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.
అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్టీఆర్ బృందాలు గల్లంతయిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ చెప్పారు. పడవ ఓవర్‌లోడ్ అవడం, పిల్లలెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు
Here's ANI Video
Gujarat | State Health Minister Rushikesh Patel says, "This is a very sad incident. Condolences to the families of those who have died. Action will be taken against those responsible for this incident. 10 people have been rescued. The government has taken the incident very… pic.twitter.com/tsSwlTyMy5
— ANI (@ANI) January 18, 2024
#WATCH | Gujarat: A boat carrying children capsized in Vadodara's Harni Motnath Lake this evening. 10 people have been rescued so far. Visuals from hospital in the city where they have been taken. pic.twitter.com/BAXDHuh0CE
— ANI (@ANI) January 18, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 18, 2024 08:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

