Doctor Saves Man's Life: వైరల్ వీడియో.. డాక్టర్ ఎదురుగా గుండె పోటుతో కుప్పకూలిన పేషెంట్, పరుగున వచ్చి రోగి ఛాతిపై సీపీఆర్ చేసి బతికించిన డాక్టర్
రోగి పరిస్థితిని గమనించిన డాక్టర్ అర్జున్ అడ్నాయక్ వెంటనే స్పందించారు. తన కుర్చీ నుంచి లేచి రోగి వద్దకు వెళ్లారు. తన చేతి పిడికిలితో రోగి ఛాతిపై సీపీఆర్ చేశారు. దీంతో ఆ వ్యక్తి తిరిగి సాధారణ స్థితికి వచ్చాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోషల్ మీడియా అనేక రకాలైన వైరల్ వీడియోలకు కేరాఫ్ అడ్రస్. తాజాగా మహారాష్ట్రలో జరిగిన సంఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం..డాక్టర్ వద్దకు వెళ్లిన ఒక రోగి ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చొని ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
కొల్హాపూర్‌కు చెందిన డాక్టర్ అర్జున్ అడ్నాయక్, అత్యుత్తమ కార్డియాలజిస్టులలో ఒకరు. మార్చి 9న గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఒక రోగి ఆయన వద్దకు వెళ్లాడు. డాక్టర్ ఎదురుగా కుర్చీలో కూర్చొన్న రోగికి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో తన పరిస్థితిని డాక్టర్‌కు చెప్పేందుకు ప్రయత్నిస్తూ స్పృహ తప్పసాగాడు.
Here's Video
This video shows an example of a real life hero living in our midst. Dr. Arjun Adnaik, one of the best cardiologists, from Kolhapur saving a patient's life. I applaud such honourable and virtuous heroes. pic.twitter.com/Gd9U2ubldJ
— Dhananjay Mahadik (@dbmahadik) September 5, 2022
మరోవైపు రోగి పరిస్థితిని గమనించిన డాక్టర్ అర్జున్ అడ్నాయక్ వెంటనే స్పందించారు. తన కుర్చీ నుంచి లేచి రోగి వద్దకు వెళ్లారు. తన చేతి పిడికిలితో రోగి ఛాతిపై సీపీఆర్ చేశారు. దీంతో ఆ వ్యక్తి తిరిగి సాధారణ స్థితికి వచ్చాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.రాజ్యసభ ఎంపీ ధనంజయ్ మహదిక్‌తోపాటు పలువురు ట్విట్టర్‌లో ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు.
(The above story first appeared on LatestLY on Sep 05, 2022 09:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

